ఏపీలో ఐఏఎస్ ల బదిలీలు -గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అర్ పి సిసోడియా..!!

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గవర్నర్ కార్యదర్విగా ఉన్న ముఖేష్ కుమార్ మీనాను అక్కడి నుంచి ప్రభుత్వం తప్పించింది. ఆయనకు పరిశ్రమల శాఖ (ఫుడ్ ప్రాసెసింగ్ ) కార్యదర్శిగా నియమించింది. ఆ స్థానంలో గవర్నర్ స్పెషల్ సీఎస్‌గా ఆర్పీ సిసోడియా బదిలీ అయ్యారు. స్టేట్ ట్యాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌గా రవిశంకర్‌ నారాయణ్‌, పీయూష్ కుమార్ జీఏడీ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సీసీఎస్‌ఏ అప్పీల్స్ కమిషనర్‌గా లక్ష్మీనరసింహంకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.

ఇక, ప్రభుత్వం తాజాగా గవర్నర్ కార్యదర్శిగా పని చేస్తున్న ముఖేష్ కుమార్ మీనా...ఏపీ గవర్నర్ గా బిశ్వభూషన్ హరి చందన్ బాధ్యతలు చేపట్టిన సమయం నుంచి అదే పోస్టులో ఉన్నారు. అప్పటి నుంచి రాజ్ భవన్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేసింది. ఆయనకు కీలకమైన పరిశ్రమల శాఖ అప్పగించింది. ఆ స్థానంలో.. సీనియర్ ఐఎఎస్ అధికారి అర్ పి సిసోడియా గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

senior IAS officers transfers in AP GOvt,Know the new secretary for governor

1991 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఆర్ పి సిసోడియా సర్వీసులో ప్రవేశించిన నాటి నుండి ఇప్పటి వరకు పలు కీలక పదవులు నిర్వహించారు. ప్రస్తుతం సిసోడియా కమీషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ గా వ్యవహరిస్తూ కీలక బాధ్యతలలో ఉన్నారు. సమైఖ్య రాష్టంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అదనపు కమీషనర్ గా, నల్గొండ జిల్లా కలెక్టర్ గా, ఈ సేవ విభాగం సంచాలకులుగా, ఇంటర్ బోర్డు కార్యదర్శిగా వ్యవహరించారు. ఉద్యానవన శాఖ కమీషనర్ గా, మానవ వనరుల అభివృద్ది సంస్ధ సంచాలకులుగా వ్యవహరించారు.

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిగా, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. అనంతరం సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య రాజకీయ కార్యదర్శిగా ప్రదాన భూమిక పోషించారు. మరో వైపు కేంద్ర సర్వీస్ లో సైతం క్రియా శీ లకంగా వ్యవహరించిన సిసోడియా కేంద్ర ఉన్నత విద్యా శాఖ సంయుక్త కార్యదర్శి గా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగానూ పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. మరి కొద్ది రోజుల్లోనే సీనియర ఐఏఎస్ అధికారుల బదిలీలు ఉన్నట్లుగా సమాచారం. ఆ సమయంలో ప్రిన్సిపల్ స్థాయి అధికారుల హోదాలో బదిలీల పైన కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+