ఇక్కడ మూగ బాలిక.. అక్కడ పేషెంట్‌.. తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు !

సమాజం ఎంత అభివృద్ధి చెందుతున్నా.. ఎన్ని చట్టాలు ఉన్నా కానీ... మహిళలపై, బాలికలపై జరిగే దారుణాలకు మాత్రం బ్రేక్ పడట్లేదు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా మృగాళ్ల కామానికి స్త్రీలు బలి అవుతూనే ఉంటున్నారు. కొన్ని కొన్ని ఘటనలు చూస్తుంటే సభ్యసమాజం సైతం తలదించుకునేలా ఉంటున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు కిరాతకులు దారుణాలకు పాల్పడుతున్నారు. కొందరు మనుషులు మృగాళ్లుగా మారుతున్నారు అనడానికి ఈ దారుణ ఘటనలే మరో ఉదాహరణ అని చెప్పాలి.

మద్యం మత్తులో మూగ బాలికపై ఇద్దరు నిందితులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అలానే వైద్యం పేరుతో ఆసుపత్రికి వచ్చిన ఆ యువతిపై మేల్ నర్సు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు రావడం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వరుస ఘటనల నేపధ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లల భద్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.

sexual-aasault-on-mute-and-patient-girls-at-ap-and-telangana-got-viral

విశాఖలో నరమృగాల పాశవికం..

విశాఖలోని సీతమ్మధారలో ఆదివారం రాత్రి మతిస్థిమితం లేని 11 ఏళ్ల మూగ బాలికను అత్యాచారం చేశారు. మద్యం మత్తులో మైనర్ మూగ బాలికపై ఇద్దరు నిందితులు అత్యాచారంకి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. ఎస్ఆర్‌నగర్‌ ప్రాంతంలో పొదల్లోకి తీసుకొని వెళ్లి.. ఈ దారుణానికి పాల్పడ్డట్టు గుర్తించారు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసు కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారని సమాచారం.

ఇక తెలంగాణలోని కరీంనగర్ నగరంలో మరో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. ఒక యువతి చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళింది. కానీ అక్కడ భరోసా ఇవ్వాల్సిన మేల్ నర్సే మృగాడిలా ప్రవర్తించాడు. వైద్యం పేరుతో ఆసుపత్రికి వచ్చిన ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. షాక్‌కు గురైన బాధితురాలు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ ప్రారంభించారు.

మాటలే చెప్పలేని బాలికలపై, వైద్యం కోసం వచ్చిన రోగిపై ఇలా దాడులు జరగడం చూస్తుంటే... మన సమాజం ఎటు వెళ్తోందో అనిపిస్తోంది. తల్లులు, తండ్రులు తమ పిల్లలను రక్షించుకోవడంలో ఎప్పటికప్పుడు భయంతో జీవించాల్సిన పరిస్థితి నెలకొందని మహిళా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+