‘ఫన్ బకెట్’ భార్గవ్‌‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

విశాఖపట్నం ప్రత్యేక పోక్సో కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో య్యూట్యూబర్ 'ఫన్ బకెట్' భార్గవ్ (Fun Bucket Bhargav)కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, కేసు వివరాల్లోకి వెళితే.. నిందితుడు భార్గవ్.. బాధిత బాలికతో టెక్‌టాక్ వీడియోలు చేస్తూ.. ఆమెను బెదిరించి, పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటంతో ఆ బాలిక గర్భం దాల్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో నిందితుడు ఫన్ బకెట్ భార్గవ్ అలియాస్ చిప్పాడ భార్గవ్‌పై కేసు నమోదైంది. ఆ తర్వాత పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. కాగా, చాలా మంది అమ్మాయిలు భార్గవ్ బాధితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Sexual assault on girl Court sentences Fun Bucket Bhargav to 20 years in prison

సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన భార్గవ్.. పలువురు అమ్మాయిలను నమ్మించి మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. బాధిత బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడటమే గాక.. ఆ దృశ్యాలను వీడియో తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమెపై మళ్లీ మళ్లీ అఘాత్యానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది.

బాధితురాలి ఫిర్యాదు నేపథ్యంలో విశాఖపట్నం నగర మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ డాక్టర్ ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఛార్జ్ షీట్ తోపాటు సాక్ష్యాలను కోర్టులో సమర్పించారు. కేసు పూర్వాపరాలు, సాక్ష్యాలను పరిశీలించిన విశాఖపట్నం ప్రత్యేక పోక్సో కోర్టు నిందితుడు భార్గవ్ కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు బాధిత బాలికకు నష్ట పరిహారంగా రూ. 4 లక్షలు చెల్లించాలంటూ న్యాయస్థానం ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+