లేడీస్ టైలర్ వద్దకు వెళ్ళిన బాలిక నగ్న దృశ్యాలు రికార్డ్, లైంగిక వేధింపులు

Posted By:
Subscribe to Oneindia Telugu

అనంతపురం: ఓ మైనర్ బాలిక నగ్నదృశ్యాలను చిత్రీకరించిన కొందరు వ్యక్తులు ఇంటర్నెట్ లో పెట్టారు. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక దుస్తులు కుట్టించుకొనేందుకు వచ్చిన సమయంలో ఆమె నగ్నచిత్రాలను తీశారు.అంతేకాదు ఆ బాలికను ఈ ఫోటోలు చూపి లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడు.

అనంతపురం జిల్లా కదిరి మండలం హనుమంతరాయపల్లికి చెందిన ఓ బాలిక నగ్నదృశ్యాలను చిత్రీకరించిన కొందరు వ్యక్తులు వాటిని ఇంటర్నెట్ లో పెట్టారు. దుస్తులు కుట్టించుకొనేందుకు ఆ బాలిక లేడీస్ టైలర్ వద్దకు వచ్చింది.

Sexual harassement on a minor girl in Anantapuram district

అయితే ఆ సమయంలో టైలర్ సమీప బంధువు గార్లపెంటకు చెందిన బ్యాంకు ఉద్యోగి నాగరాజు బాలిక నగ్నచిత్రాలను రహస్యంగా చిత్రీకరించాడు. ఆ బాలికను నాగరాజు లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు.

ఆ బాలిక ఎంతకు లొంగకపోవడంతో ఆ నగ్నదృశ్యాలను తన స్నేహితుడు నగేష్ తో కలిసి నాగరాజు ఇంటర్నెట్ లో పెట్టాడు. బాలిక బంధువులు కొందరు వాటిని చూసి ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు.దీంతో బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాలిక నగ్నదృశ్యాలను సేకరించిన కవిత, నాగరాజు, నగేష్ ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.నిందితులపై పోస్కో , ఐటీ చట్లాల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు పోలీసులు,

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sexual harassement on a minor girl in Anantapuram district. when she was went to ladies tailor for stitching clothes Nagaraju recorded girls nude video.he blackmailed her.victim family complaint against him.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి