ఎన్నికల ముందు బయటపడ్డ వివాహేతర సంబంధం (వీడియో)

నటుడు రవి కిషన్ ..అంటే పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు కానీ..అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం సినిమా విలన్ అంటే మాత్రం సినీ అభిమానులందరూ ఠక్కున గుర్తు పడతారు. రేసుగుర్రం సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి కిషన్, భాషతో సంబంధం లేకుండ తమిళ , కన్నడ, మళయాళ సినిమాలు చేస్తూ ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇక రవి కిషన్ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు.

2019 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్ నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారాయన. దీంతో ఆయనకు మరోసారి బీజేపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. గోరఖ్‌పూర్ నియోజవర్గం నుంచే రవి కిషన్ బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఆయనకు ఓ మహిళ షాకిచ్చింది. రవి కిషన్ తనని తన కూతురిని మోసం చేశాడంటూ ఓ మహిళ ప్రెస్ మీట్ పెట్టింది.

shocking alligations on actor-politician Ravi Kishan

లక్నోకి చెందిన అపర్ణ ఠాకూర్ తన కూతురు షెనోవాతో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. 1996 లో ర‌వికిష‌న్‌తో తనకు వివాహం జ‌రిగింద‌ని ..తమకు 15 ఏళ్ల కుమార్తె కూడా ఉంద‌ని అపర్ణ ఠాకూర్ ఆరోపించింది. ఇప్ప‌టికీ ర‌వికిష‌న్ త‌మ రిలేష‌న్ షిప్‌లో ఉన్నాడని మీడియా స‌మావేశంలో తెలిపింది. దీనిపై అపర్ణ ఠాకూర్ కూతురు షెనోవా మాట్లాడుతూ.. 15 ఏళ్లు వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కూ ర‌వికిష‌న్ త‌న‌కు తండ్రి అనే విష‌యం తెలియ‌ద‌ని..అంకుల్ అని పిలిచేదాన్ని అని చెప్పుకొచ్చింది.

ర‌వి కిష‌న్ కుటుంబాన్ని కూడా తాను క‌లిశాన‌ని... తండ్రిగా త‌న ద‌గ్గ‌ర‌కు ఎప్పుడూ రాలేద‌ని... త‌న‌ని ఆయన కూతురుగా స్వీక‌రించాల‌ని కోరింది. ఇదిలా ఉంటే రవి కిషన్‌కు ఇప్పటికే ప్రీతి అనే మహిళతో అఫిషియల్‌గా పెళ్లైంది. వీరిద్దరికి రివా.. తనిష్క్.. ఇషిత అనే ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. సరిగ్గా ఎన్నికల సమయంలో ర‌వి కిష‌న్ ఎఫైర్ బయటపడటంతో ఆయన పొలిటికల్ కెరీర్‌ ఏమౌతుందోనని అభిమానులు భయపడుతున్నారు. ఈ ఆరోపణలపై ర‌వి కిష‌న్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+