గుంటూరులో బాలికకు డ్రగ్స్ అలవాటు చేసి అసభ్య వీడియోలు.. తల్లి ఆత్మహత్యాయత్నం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏపీలోని గుంటూరు నగరంలో ఒక ఇంటర్ విద్యార్థినిని డ్రగ్స్ కు బానిసను చేసి ఆమెతో అసభ్యకర వీడియోలు, ఫోటోలు చిత్రీకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో, బాలిక అసభ్యకర ఫోటోలు, వీడియోలు చూసిన తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన వివరాలలోకి వెళితే
బాలికకు డ్రగ్స్ ఇచ్చి అసభ్య వీడియోలు
గుంటూరు నగరంలో 17 సంవత్సరాల వయసున్న ఒక ఇంటర్ విద్యార్థిని డ్రగ్స్ బారిన పడింది. అదే కళాశాలలో సీనియర్ ఇంటర్ విద్యార్థితో instagram లో పరిచయం ఏర్పరచుకున్న బాలిక ప్రేమ పేరుతో అతనికి దగ్గరయింది. దీంతో అతను బాలికకు డ్రగ్స్ అలవాటు చేశాడు. తన గదికి రప్పించి మత్తు పదార్థాలు ఇచ్చి ఆపై ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తన స్నేహితుడితో ఆ దృశ్యాలను వీడియోలు ఫోటోలు ద్వారా రికార్డు చేయించాడు.

కూతురి వీడియోలు చూసి తల్లి ఆత్మహత్యా యత్నం
రెండు రోజుల క్రితం బాలిక ఫోన్ పరిశీలించిన తల్లికి అందులో యువకుడితో సన్నిహితంగా ఉన్న అభ్యంతరకరమైన ఫోటోలు కనిపించాయి. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించారు. బాలిక వారికి సమాధానం చెప్పకపోగా తిరిగి వారి పైన దాడికి పాల్పడింది. దీంతో నిద్ర మాత్రలు మింగి తల్లి ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. ఆపై తల్లిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు.
కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం
అయితే ఈ విషయం తెలుసుకున్న ఈగల్ విభాగ ఐజి ఆర్కే రవి కృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీ వకుళ్ జిందాల్ జిజిహెచ్ కు వెళ్లి బాలిక తల్లిని పరామర్శించారు. ఈ కేసు పైన సమగ్ర దర్యాప్తు చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని బాలిక తల్లికి హామీ ఇచ్చారు ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందంతో ఈ కేసులో విచారణ ప్రారంభించారు.
బాలికకు డ్రగ్స్ అలవాటు చేసిన వ్యక్తి విద్యార్ధి సంఘం నాయకుడు
అయితే బాలికకు డ్రగ్స్ అలవాటు చేసిన యువకుడు ఒక రాజకీయ పార్టీకి చెందిన విద్యార్థి సంఘ నాయకుడని ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. బాలిక ప్రవర్తన తెలిసిన తల్లిదండ్రులు వేరే యువకుడితో వివాహం చేయాలని నిశ్చయించగా, అది ఇష్టం లేక మీ కుటుంబంతో గొడవ పడుతుందని పోలీసులు చెప్తున్నారు.
తల్లి ఆత్మహత్యా యత్నంతో బయటకు వచ్చిన ఘటన
మొత్తంగా ఫోన్లో కూతురు అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు చూసిన తల్లి ఆత్మహత్యాయత్నం చేయగా ఈ వ్యవహారం బయటకు వచ్చింది. మైనర్ బాలికతో ఈ విధమైన చర్యలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications