చంద్రబాబుపై ఆర్జీవీ పగ వెనుక షాకింగ్ రీజన్!!

వివాదాస్పద దర్శకుడు, నిత్యం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసే రాంగోపాల్ వర్మ ఏపీ రాజకీయాలపై తనదైన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాలలో కాక పుట్టిస్తున్న విషయం తెలిసిందే. రాంగోపాల్ వర్మ చంద్రబాబును గురించి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గురించి చేసే వ్యాఖ్యలు చూసేవారికి రాంగోపాల్ వర్మకు చంద్రబాబుపై ఎందుకింత పగ అన్న విధంగా ఉంటాయి.

తాజాగా రాంగోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబుపై పగ వెనుక బలమైన కారణం ఉందని చెప్పారు. ఒక టీవీ షోలో ఆలీతో ఇంటర్వ్యూలో పాల్గొన్న రాంగోపాల్ వర్మ ఏపీ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కొత్త సినిమా వ్యూహం గురించి కూడా చాలా విషయాలను రాంగోపాల్ వర్మ పంచుకున్నారు.

Shocking reason behind Ram gopal varma grudge against Chandrababu naidu!!

ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ వైస్రాయ్ హోటల్ ఘటన నుండి చంద్రబాబుపై తనకు పగ ఉందని, చంద్రబాబు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని, అధికారాన్ని లాక్కున్నాడు అని, అప్పట్నుంచి చంద్రబాబు అంటే తనకు నచ్చదని రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలు చేశారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలోని పొలిటికల్ లీడర్స్ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి అంటే చాలా ఇష్టమని రాంగోపాల్ వర్మ వెల్లడించారు. తాను ఏపీ రాజకీయాలపై తీసిన సినిమా వ్యూహంలో ఏపీ రాజకీయాలకు సంబంధించి జనాలకు తెలియని ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉన్నాయని వెల్లడించారు. చంద్రబాబుకు సంబంధించిన బండారం అంతా ఆ సినిమాలో ఉందని అందుకే తన సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలు చేశారు.

ఏం చేసినప్పటికీ వ్యూహం సినిమా రిలీజ్ అయి తీరుతుందని ఆయన తేల్చి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతునిస్తూ, టిడిపి అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ రాంగోపాల్ వర్మ చేసే పోస్టులు, చంద్రబాబును ఆయన టార్గెట్ చేసే విధానం ఏపీలో ఎప్పుడు చర్చనీయాంశమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+