ఎస్ఐ రాసలీలలు: ఆమె భర్తే వీడియో లీక్ చేశాడు.. సోషల్ మీడియాలో చక్కర్లు

కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌ ఎస్‌ఐ-2 విజయ్ కుమార్ అడ్డంగా దొరికిపోయాడు.

విజయవాడ: ఒంటి మీద చొక్కా పడగానే సామాన్యుల మీద ఎక్కడ లేని జులుం ప్రదర్శించే పోలీసులు కొందరైతై.. పోలీస్ ట్యాగ్ అడ్డం పెట్టుకుని అవినీతి, రాసలీలలకు తెరలేపేవారు మరికొందరు.

కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌ ఎస్‌ఐ-2 విజయ్ కుమార్ రెండో కోవకు చెందినవాడు. పోలీస్ అన్న ధైర్యంతో తనను బెదిరించి మరీ తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఓ భర్త గారు వాపోతున్నారు. వాపోవడమే కాదు.. తన భార్య, ఎస్ఐ విజయ్ రాసలలీల వీడియో కూడా బహిర్గతం చేసినట్లు తెలుస్తోంది.

SI Illegal affair with another woman in hanuman junction

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఎస్ఐ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ సదరు మహిళ భర్తే ఈ వీడియోను పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

కాగా, విజయ్ కుమార్ ముసునూరు ఎస్‌ఐగా పని చేస్తున్న సమయంలో ఓ బ్యుటీషియన్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. విషయం ఆమె భర్తకు తెలిసి, విడాకుల దాకా వెళ్లినా.. విజయ్ మాత్రం ఆమెతో సంబంధాన్ని తెంచుకోలేదు. సరికదా.. మూడేళ్ల నుంచి ఆమెతో తన రాసలీలలు కొనసాగిస్తున్నాడు.

దీంతో విజయ్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆమె భర్త వీరిద్దరు సన్నిహితంగా ఉన్న వీడియోను బయటపెట్టాడు. విజయ్ నుంచి తనను కాపాడాలని అతను వేడుకుంటున్నాడు. వీడియో ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లడంతో ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠీ అతన్ని విధుల నుంచి తప్పించి వీఆర్‌కు పంపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+