సింపుల్‌గా ఇలా చేయండి... తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అవుతుంది

సాధారణంగా ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే అందుకనుగుణంగా ప్రణాళిక రూపొందించుకొని ఆ ప్రకారం టికెట్లు రిజర్వేషన్ చేయించుకుంటాం. అలా కాకుండా అనుకోకుండా ప్రయాణం పడుతుంది. అప్పుడు రిజర్వేషన్ కావాలంటే ఒకరోజు ముందుగా తత్కాల్ టికెట్ తీసుకోవడమే. అయితే తత్కాల్ టికెట్ ను చాలామంది ప్రయత్నిస్తుండటంతో చాలా తక్కువమందికే టికెట్లు దొరుకుతాయి. తత్కాల్ లో వేగంగా టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

IRCTC ఖాతా ఉండాలి
IRCTC ఖాతా లేకపోతే వెంటనే ఖాతా తెరవండి. పేరు, చిరునామా, ఫోన్ నంబర్ వంటి వివరాలు సరిచూసుకోవాలి. పేమెంట్ ఆప్షన్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి. క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా యూపీఐ వివరాలు సిద్ధంగా ఉంచాలి. వై-ఫై లేదంటే అత్యంత వేగం కలిగిన, స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. నెట్‌వర్క్ సమస్యల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ముందే చూసుకోవాలి.

Simple tip to book Tatkal ticket faster

తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో
ఏసీ తత్కాల్ కోసం ఉదయం 9:57 గంటలకు, స్లీపర్ క్లాస్ కోసం 10:57 గంటలకు లాగిన్ అవ్వండి. ప్లాన్ మై జర్నీ పేజీని ఓపెన్ చేసి సమయం వచ్చిన వెంటనే వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల సమయం ఆదా అవుతుంది. మాస్టర్ లిస్ట్ అనే ఆప్షన్‌ను ఉపయోగించి ప్రయాణికుల వివరాలను ముందుగానే సేవ్ చేసుకోవచ్చు. క్యాప్చా కోడ్‌ను సరిగ్గా ఎంటర్ చేయడం చాలా ముఖ్యం. పేమెంట్ ఆప్షన్‌ను ముందుగానే సెలెక్ట్ చేసి ఉంచడం వల్ల పేమెంట్ ప్రాసెస్ వేగంగా జరుగుతుంది. తరచూ పేజీని రిఫ్రెష్ చేస్తే సమయం వృథా అవుతుంది.

ఇంకా ఏం చేయాలంటే
ఒకే ఖాతాతో విభిన్న డివైసెస్‌లో ప్రయత్నించవచ్చు. కొన్నిసార్లు మొబైల్ డేటా వేగంగా పనిచేస్తుంది. వైఫైకన్నా ఒక్కోసారి మొబైల్ డేటా వాడాలి. IRCTC యాప్ ద్వారా బుకింగ్ చేయడం వల్ల టికెట్ బుకింగ్ వేగంగా ఉండవచ్చు. నెమ్మదిగా ఉండే కంప్యూటర్‌ను ఉపయోగించడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. అందుకని మంచి ఫాస్ట్ గా ఉండే కంప్యూటర్ ను వాడాలి. అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+