బయటకొచ్చిన టీడీపీ మహిళ నేత వీడియో..సొంత నాయకులే
సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బీజేపీ జనసేన పొత్తు వల్ల తెలుగు తమ్ముళ్లు త్యాగాలకు సిద్ధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో టీడీపీ నాయకుల టికెట్లకు ఎసరొచ్చింది. గత ఐదేళ్లుగా కష్టపడి పని చేసిన తమను కాదని పొత్తులో ఆ సీట్లను ఇప్పుడు వేరే వారికి కేటాయించడంపై కొందరు టీడీపీ నాయకులు నేరుగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక టికెట్ వచ్చిన నేతలు సైతం దాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడుతున్నారు.
పోటీలో ఉండేందుకు టీడీపీ నాయకులు నానా తంటాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా టీడీపీ అభ్యర్థికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సింగనమల టీడీపీ టికెట్‌ను బండారు శ్రావణికి చంద్రబాబు కేటాయించారు. అయితే సొంత క్యాడరే ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బండారు శ్రావణి మొదటి నుంచి వివాదాలతోనే సావాసం చేస్తున్నారు. ఎన్నికల్లో ఆమెకు సహకరించేది లేదని సీనియర్ టీడీపీ నాయకులు చెబుతున్నారు.

ఎన్నికల్లో ఆమెకు మద్దతుగా నిలిచే పరిస్థితి లేదని స్థానిక టీడీపీ నేతలు తేల్చి చెబుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన బండారు శ్రావణి వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలం నర్సానాయుడు, సీనియర్ నాయకుడు కేశవరెడ్డిలతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. గత ఎన్నికల్లో నీ గెలుపు కోసం గడప గడపకు తిరిగిన తమపైనే నువ్వు కేసులు పెట్టించావని టీడీపీ సీనియర్ నాయకులు బండారు శ్రావణిని ప్రశ్నించారు.
టీడీపీలో బయటపడ్డ విభేదాలు..!#BandaruSravani #KeshavaReddy #AndhraPradesh #TDPJSPTogether #Janasena #TDP #Oneindiatelugu pic.twitter.com/KzNLICz1R1
— oneindiatelugu (@oneindiatelugu) March 11, 2024
తమను అణగదొక్కే ప్రయత్నం చేసిన నీకు సహకరించేది ప్రసక్తే లేదని వారు బండారు శ్రావణికి తేల్చి చెప్పడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీంతో బండారు శ్రావణి సమావేశం నుంచి నిరాశగా వెనుతిరిగారు. బండారు శ్రావణికి జనాదరణ ఉన్నా, పార్టీ కేడర్‌ను కలుపుకుని వెళ్లకపోవడం ఆమెకు మైనస్ అవుతోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీ కేడర్ చాలా మంది శ్రావణి కి వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో పార్టీ అధిష్టానం ఈ విషయంలో కలుగజేసుకుని సమస్యను పరిష్కరిస్తుందా లేదా మరో వ్యక్తికి టికెట్ ఇస్తారా అనేది త్వరలోనే తేలనుంది.












Click it and Unblock the Notifications