సింగిల్ డోర్ ఫ్రిజ్ బెటరా? లేదంటే డబుల్ డోర్ ఫ్రిజ్ బెటరా?

ఈ రోజుల్లో ఫ్రిజ్ లేని ఇల్లే లేదని చెప్పవచ్చు. జీవన విధానం శరవేగంగా మారిపోతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరికీ ఇంట్లో రిఫ్రిజిరేటర్ తప్పనిసరైంది. వేసవి కాలం వస్తే ఎంత డిమాండ్ ఉంటుందో అంచనా వేయలేం. మనలో చాలామందికి ఏ ఫ్రిజ్ అయితే మంచిది? సింగిల్ డోర్ ఫ్రిజ్ మంచిదా? లేదంటే డబుల్ డోర్ ఫ్రిజ్ మంచిదా అనే సందేహం వస్తుంటుంది.

డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ కన్నా ెక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. సింగిల్ డోర్ ఉన్నవి సైజులో చిన్నవి కావడంతో వాటిని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చిన్న కుటుంబానికి సింగిల్ డోర్ ఫ్రిజ్ సరిపోతుంది. ఆహారాన్ని చల్లగా ఉంచడానికి, తాజాగా ఉంచడానికి డైరెక్ట్ కూలింగ్ సాంకేతికతను సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఉపయోగించుకుంటుంది. ఒకవేళ కుటుంబం పెద్దదైతే చిన్నది సరిపోకపోవచ్చు. అప్పుడు డబుల్ డోర్ ఫ్రిజ్ తీసుకోవడం ఉత్తమం.

single door and double door refrigerators uses in telugu

డబుల్ డోర్ ఫ్రిజ్ పెద్ద సామర్థ్యంతో వస్తాయి. కూరగాయలు, పచ్చళ్లు, పాలు లేదా ఇతర వస్తువులు ఎక్కువ కాలం నిల్వ చేస్తారు. ఫ్రీజర్ కోసం ప్రత్యేక తలుపు ఉంటుంది. మీరు ఫ్రీజర్‌ను యాక్సెస్ చేయడానికి ఫ్రిజ్ తలుపు తెరవాల్సిన అవసరం ఉండదు. దీంట్లో ఉండే ఫ్రీజర్ సైజు కూడా పెద్దదిగానే ఉంటుంది. ఇది ఖరీదు ఎక్కువ. సామర్థ్యం ఎక్కువగా ఉండటంవల్ల విద్యుత్తును కూడా ఎక్కువగా వినియోగిస్తుంది. సాధారణంగా ఇవి ఫ్రాస్ట్-ఫ్రీ సాంకేతికతతో వస్తాయి. ఇది పనిచేయడానికి 30 నుంచి 40 శాతం అదనంగా విద్యుత్తును తీసుకుంటాయి.

మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు? ఉపయోగించే విధానం.. కరెంటు ఛార్జీలు తదితర అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని ఫ్రిజ్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మీ కుటుంబంలో ఎక్కువమంది ఉంటారనుకుంటే, కరెంటు బిల్లు కూడా ఎంత వచ్చినా పర్వాలేదు అనుకుంటే డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ను కొనుగోలు చేయడం ఉత్తమం. చిన్న కుటుంబమేకదా.. అంత పెద్దది ఎందుకు అనుకుంటే సింగిల్ డోర్ ఫ్రిజ్ కొనుగోలు చేయడం ఉత్తమం. దీనికి విద్యుత్తు కూడా తక్కువగా వినియోగించుకుంటుంది. బిల్లు కూడా తక్కువ వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+