అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నయీం కేసు: చంద్రబాబు శరణుజొచ్చిన పోలీసు అధికారులు, సాక్షి కథనం ఇలా

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని సాక్షి దినపత్రిక తన రాతలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయారంటూ వైసీపీ నేతలు చేసిన ఆరోపణల్ని సాక్షి పత్రిక పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే తాజాగా ఇప్పుడు గ్యాంగ్ స్టర్ నయీం కేసులో సాగుతున్న దర్యాప్తునకు సీఎం చంద్రబాబు నాయుడు మోకాలడ్డుతున్నారంటూ ఓ కథనాన్ని రాసింది.

ఆ కథనం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో పనిచేసిన కొందరు అధికారులను, తన పార్టీకి చెందిన కొందరు నేతలను కాపాడుకునేందుకు యత్నిస్తున్నారంటూ అందులో పేర్కొంది. సాక్షి దినపత్రికలో పేర్కొన్న కథనం ప్రకారం...

నయీం కేసులో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, 21 మంది పోలీసు అధికారులకు సంబంధాలున్నట్లు నివేదికలో పొందుపరిచారు. సిట్ అధికారలు పేర్కొన్న నివేదికలో పేర్లున్న, ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆరుగురు అధికారులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి శరణు జొచ్చారని రాసింది.

 SIT Investigation on mlas and mlcs role in nayeem case

తాము కేవలం అప్పటి ప్రభుత్వ అవసరాల కోసమే పనిచేశామని, వ్యక్తిగతం కోసం కాదని ఆయనకు వివరించారు. ఈ కేసులో తమ పేర్లు బయటకురాకుండా, అరెస్ట్ కాకుండా కాపాడాలని కోరారంట. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల కిందట కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఫోన్లో సంప్రదించి ఈ విషయాలను వివరించారని సమాచారం.

తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ ఆరుగురు అధికారులపై ఎలాంటి చర్య తీసుకోకుండా చూడాలని కోరినట్లు సాక్షి తన కథనంలో రాసింది. మరోవైపు ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉన్న సమయంలో టీడీపీకి చెందిన కొందరు ముఖ్య నాయకులు, మంత్రులుగా పనిచేసిన వారికి నయీంతో సంబంధాలున్నట్టు సిట్ దర్యాప్తులో బయటపడినట్లు తెలుస్తోంది.

ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయని తేలితే సొంత పార్టీ వారని కూడా చూడొద్దని సీఎం కేసీఆర్ ఇప్పటికే పోలీసు అధికారులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో విపక్షాలకు చెందిన నేతలు వణికిపోతున్నారు. టీడీపీకి చెందిన కొందరు నేతలు ఈ కేసు నుంచి తమను బయట పడేయాలని పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబును కోరినట్లు ప్రచారం జరుగుతోంది. తన హయాంలో అధికారులుగా పనిచేసిన వారు, ప్రభుత్వంలో భాగస్వాములైన తమ పార్టీ నేతలను కాపాడుకునే పనిలో పడిన చంద్రబాబు 'సిట్' దర్యాప్తునకు మోకాలడ్డుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సొహ్రాబుద్దీన్ కేసును సాకుగా చూపి..
టీడీపీ పాలనలోనే నక్సలైట్లకు వ్యతిరేకిగా మారిన నయీం 1990 నుంచి తన కార్యకలాపాలను మొదలు పెట్టాడు. గుజరాత్‌కు చెందిన సొహ్రాబుద్దీన్‌తోనూ సంబంధాలు కొనసాగించాడు. నయీంను కలిసేందుకే హైదరాబాద్‌కు వచ్చి గుజరాత్‌కు పయనమైన సొహ్రాబుద్దీన్.. 2005 నవంబర్‌లో గుజరాత్ ఏటీఎస్ (యాంటీ టైస్ట్ స్క్వాడ్) చేతిలో ఎన్‌కౌంటర్ అయ్యాడు.

సొహ్రాబుద్దీన్‌ను గుజరాత్ ఏటీఎస్ అదుపులోకి తీసుకోవడంలో అప్పటి ఏపీ పోలీసుల సహకారం ఉందని, అసలు వారికి ఆ సమాచారం ఇచ్చిందే నయీం అన్న ప్రచారం కూడా లేకపోలేదు. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని ఆ ఆరుగురు పోలీసు అధికారులు ఇప్పుడు ఇదే ఉదంతాన్ని అడ్డం పెట్టుకుని కేసు నుంచి బయట పడాలని చూస్తున్నారు.

తాము కేవలం సొహ్రాబుద్దీన్‌కు సంబంధించిన సమాచారం సేకరించడానికే నయీంతో సంబంధాలు కొనసాగించామంటూ నమ్మబలుకుతున్నట్టు తెలుస్తోంది. ఇదే సొహ్రాబుద్దీన్ కేసులో ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాపై ఆరోపణలు రావడంతో నాడు గుజరాత్ కేబినెట్ నుంచి వైదొలిగారు. ఈ ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు అమిత్ షాకు ఈ కేసు విముక్తి కల్పించింది.

కాగా, సొహ్రాబుద్దీన్ కేసును నాడు సీబీఐకి అప్పగించారు. అప్పట్నుంచి మొన్న ఎన్‌కౌంటర్‌లో హతమయ్యే వరకు నయీం సీబీఐకి దొరక్కుండా తప్పించుకు తిరిగాడు. ఇప్పుడు ఇదే కేసును అడ్డం పెట్టుకుని బయటపడేందుకు ఏపీ సీఎం చంద్రబాబును సదరు అధికారులు కలవడం చర్చనీయాంశమైంది.

English summary
SIT Investigation on mlas and mlcs role in nayeem case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X