నెట్లో రేప్ వీడియో: సునితా కృష్ణన్ ఆగ్రహం, ఓల్డ్ సిటీలో దాడి(పిక్చర్స్)
హైదరాబాద్: సామాజిక కార్యకర్త, ప్రజ్వల హోం నిర్వాహకురాలు సునితా కృష్ణన్‌పై కొందరు వ్యక్తులు శుక్రవారం నాడు ఉదయం దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆమె కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. సునితా కృష్ణన్ తన ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసి ఓ వీడియో ఈ దాడికి కారణమైంది. ఓ యువతిపై ఐదుగురు యువకులు అత్యాచారం చేసి ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె అత్యాచారానికి కారకులైన యువకుల ముఖాలను గుర్తించే విధంగా వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. వీడియో పోస్టింగ్‌కు ముందు సునితా కృష్ణన్ పలు జాగ్రత్తలు తీసుకున్నారు. అత్యాచారానికి గురైన బాధితురాలు ముఖం కనిపించకుండా కేవలం అత్యాచారానికి పాల్పడి పైశాచిక ఆనందం పొందిన యువకుల ముఖాలను రౌండ్ చేస్తూ వీడియోను పోస్టు చేశారు.
అత్యాచార ఘటనపై ప్రజ్వల హోం నిర్వాహకురాలు సునితా కృష్ణన్ ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేశామని హైదరాబాద్ అడిషినల్ సీపీ స్వాతిలక్రా చెప్పారు. ప్రజలు ఇటువంటి సంఘటనలపై తక్షణం స్పందించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె అన్నారు.

అద్దాలు పగిలిన సునితా కృష్ణన్ కారు
హైదరాబాదులోని పాతబస్తీలో సామాజిక కార్యకర్త, ప్రజ్వల హోం నిర్వాహకురాలు సునితా కృష్ణన్ కారు పైన దాడి జరిగింది.

అద్దాలు పగిలిన సునితా కృష్ణన్ కారు
హైదరాబాదులోని పాతబస్తీలో సామాజిక కార్యకర్త, ప్రజ్వల హోం నిర్వాహకురాలు సునితా కృష్ణన్ కారు పైన దాడి జరిగింది. అద్దాలు పగిలిన దృశ్యం.

ఘటన వద్ద పోలీసులు
హైదరాబాదులోని పాతబస్తీలో సామాజిక కార్యకర్త, ప్రజ్వల హోం నిర్వాహకురాలు సునితా కృష్ణన్ కారు పైన దాడి జరిగిన నేపథ్యంలో వివరాలు సేకరిస్తున్న పోలీసులు.

సునితా కృష్ణన్
దాడిపై సునితా కృష్ణన్ మాట్లాడుతూ.. తన కారుపై దాడికి పాల్పడింది రేపిస్టులేనని అనుమానం వ్యక్తం చేశారు. సామూహిక అత్యాచారానికి సంబంధించిన మీడియోను యూ ట్యూబ్‌లో చూసి మౌనంగా ఉండలేకపోయానన్నారు. ఇంతటి దారుణమైన దృశ్యాలు ఎన్నో రోజులుగా యూ టూబ్‌లో ఉన్నాయని, దానిని చూసిన ఏ ఒక్కరూ స్పందించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అంశాలలో సమాజం వైఖరి మారాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications