ప్రవచనకర్త గరికపాటిపై సోషల్ మీడియా ప్రచారం.. వారికి సీరియస్ వార్నింగ్!

ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఆయన ప్రవచనాలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయన హిందూ ధర్మానికి సంబంధించి, మానవ జీవన విధానానికి సంబంధించి చెప్పే ప్రవచనాలు జనాలను ఆకట్టుకుంటాయి. అందుకే ఆయనకు భారీగానే ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో గరికపాటి నరసింహారావు పైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

గరికపాటిపై సోషల్ మీడియా ప్రచారం.. ఖండించిన టీం
ఆయన వ్యక్తిగత జీవితం పైన ఆయన పెళ్లిళ్లపైన రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆయన మొదటి భార్యను వదిలేసి, మళ్ళీ పెళ్లి చేసుకున్నారని రకరకాల ప్రచారం జరుగుతుంది. దీంతో గరికపాటి నరసింహారావు వ్యక్తిగత జీవితం పై వస్తున్న వార్తలను గరికపాటి టీం ఖండించింది.

పరువు నష్టం దావా వేస్తాం

ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారంతో గరికపాటి గౌరవానికి భంగం కలిగిస్తున్నారని, సదరు వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన టీం హెచ్చరికలు జారీ చేసింది. గరికపాటి గౌరవానికి భంగం కలిగిస్తే పరువు నష్టం దావా వేస్తామని పేర్కొంది.

Social media campaign against Garikapati Narasimharao garikapati team Serious warning to them

పారితోషకాల విషయంలోనూ, ఆస్తుల విషయంలో అసత్య ప్రచారాలు
గరికపాటి నరసింహారావు వేర్వేరు ఘటనల్లో ఎవరెవరికో క్షమాపణలు చెప్పాడని, ఎవరికి తోచినట్టు వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన టీం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇక గరికపాటి తీసుకునే పారితోషకాల విషయంలోనూ, ఆస్తుల విషయంలో కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది. గరికపాటిపై ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రచారం నిరాధారమైనదని, సత్య దూరమైనదని వెల్లడించింది.

గరికపాటి ఫ్యామిలీ కలత
వీటిని తమ ఖండిస్తున్నామని, తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ ను వ్యక్తులపైన పరువు నష్టం కేసులు వేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఈ దుష్ప్రచారంతో గరికపాటి కుటుంబ సభ్యులు ఆయన అభిమానులు తీవ్రంగా కలత చెందుతున్నారని, కాబట్టి ఈ విషయంలో ఎవరూ ఎటువంటి తప్పుడు ప్రచారాలు చేయకూడదని సూచించింది.

గరికపాటి పోస్ట్
ఎవరైనా వ్యక్తులు గాని, సోషల్ మీడియా గానీ ఇకపై ఎటువంటి తప్పుడు ప్రచారం చేసిన కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని గమనించగలరు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. ఇక ఇదే విషయాన్ని గరికపాటి నరసింహారావు కూడా తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+