మెగాస్టార్ ఫ్యామిలీతో పెట్టుకుని ఇండస్ట్రీలో అవకాశాలు కోల్పోయిన నటులు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగా కుటుంబం గురించి తెలియనివారు ఉండరు. ఇండస్ట్రీలో వీరికి ఎంతో గౌరవం ఉంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన చిరంజీవి...తన కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలను పరిచయం చేశారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమంది పేదలకు సాయం చేస్తున్నారు. చిరంజీవి కుటుంబాన్ని ఇష్టపడేవారు కోట్లలో ఉంటారు.అలాగే పరిశ్రమలో మెగాస్టార్ కుటుంబం అంటే పడనివాళ్లు కూడా ఉంటారు. మెగా కుటుంబాన్ని తిట్టి సినిమాలకు దూరమైనవారు కొందరున్నారు. వారెవరనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయ్ కిరణ్ : తెలుగు సినీ పరిశ్రమలో లవర్ బాయ్ గా అతి తక్కువ సమయంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. కోట్లాదిమంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఉదయ్ కిరణ్ ను చిరంజీవి తన అల్లుడిగా చేసుకోవాలనుకున్నారు. పెద్ద కుమార్తె సుస్మితతో ఎంగేజ్ మెంట్ వైభవంగా జరిపించారు. కారణాలు ఇప్పటికీ తెలియరాలేదుకానీ ఉదయ్ కిరణ్ సుస్మిత వివాహం ఆగిపోయింది. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ సినిమా అవకాశాలను కోల్పోయారు.

 megastarfamily-

శ్రీ రెడ్డి : కాస్టింగ్ కౌచ్ గురించి, తెలుగు ఇండస్ట్రీలో జరిగే అవమానాలు, అన్యాయాల గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది. దగ్గుబాటి అభిరామ్ పై విరుచుకుపడుతుంది. పవన్ కల్యాణ్ ను అసభ్య పదజాలంతో దూషించి రచ్చ రచ్చ చేసింది. తర్వాత సినిమా అవకాశాలను కోల్పోయింది. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, వివాదాస్పదమైన ట్వీట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది.

చిన్ని కృష్ణ : సినీ పరిశ్రమలో మంచి రైటర్ గా పేరు ప్రఖ్యాతు సంపాదించుకున్నారు. చిన్ని కృష్ణ కూడా చిరంజీవి కుటుంబంపై నోరు పారేసుకున్నాడు. చిరంజీవి కుటుంబం ఎవరిని దగ్గరికి తీసుకోదని, సహాయం చేయదంటూ నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఆయన ఆరోపణలు అబద్ధం అని తెలుసుకున్న కొందరు ఆయనకు ఆఫర్స్ ఇవ్వలేదు. క్రమేణా పరిశ్రమలో సినిమా అవకాశాలను కోల్పోయాడు.

పోసాని కృష్ణ మురళి : పరిశ్రమలో పేరు తెచ్చుకున్నవారిలో పోసాని కృష్ణమురళి ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉండేవారు. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడంటూ నోరు పారేసుకొని అవకాశాలను పోగొట్టుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+