ఎన్టీఆర్‌పై చెప్పులు, బాలకృష్ణ మాట్లాడుతుంటే నవ్వుతారా?: బాబు వైఖరిపై సోము నిప్పులు

విజయవాడ: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడటంపై ఆ పార్టీ నేత సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని అడ్డుకోవడంలో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. శుక్రవారం అమిత్ షా కాన్వాయ్‌పై అలిపిరి వద్ద టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడిన విసక్ష్ం తెలిసిందే.

సోము వీర్రాజు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించారు. ఈ దాడిపై చంద్రబాబు ప్రకటనలు చూస్తే ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో సామాన్య ప్రజలకే కాదు ఓ పార్టీ జాతీయ అధ్యక్షుడికి కూడా రక్షణ లేకుండా పోయిందని అన్నారు.

 బాబు మనసులో వైఖరి వేరేగా..

బాబు మనసులో వైఖరి వేరేగా..

దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై చంద్రబాబు కేసులు పెట్టలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదని సోము వీర్రాజు మండిపడ్డారు. శాంతియుతంగా ఉండాలని మాత్రమే అంటున్నారని, ఆయన మనసులో వైఖరి మాత్రమే వేరేగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు రక్షణ కల్పించాల్సిన సీఎం చంద్రబాబు.. తనకు రక్షణ కావాలని అడగడం విడ్డూరంగా ఉందని అన్నారు. అవినీతికి పాల్పడుతూ అవినీతిపై పోరాటమంటారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు నిజాయితీ ఉంటే అమిత్ షా కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి, అరెస్ట్ చేయించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్పీని సస్పెండ్ చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

బాలకృష్ణ అలా మాట్లాడుతుంటే నవ్వుతారా?

బాలకృష్ణ అలా మాట్లాడుతుంటే నవ్వుతారా?

చంద్రబాబు ఇటీవల ధర్మపోరాటం పేరుతో చేసిన దీక్షలో ఎమ్మెల్యే బాలకృష్ణ దేశ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే నవ్వుకుంటూ ఉన్నారే గానీ, అడ్డుకునే ప్రయత్నం చేయలేదని సోము వీర్రాజు అన్నారు. అదీ ఆయన నైజమని మండిపడ్డారు. బాలకృష్ణపై ఎలాంటి కేసులు కూడా పెట్టలేదని అన్నారు.

 ఎన్టీఆర్‌పైనే చెప్పులేయించారు..

ఎన్టీఆర్‌పైనే చెప్పులేయించారు..

బీజేపీ నిరసనలు చేస్తే మాత్రం అక్రమంగా కేసులు పెడుతోందంటూ బాబు ప్రభుత్వంపై సోము వీర్రాజు మండిపడ్డారు. మా ఇంటిపైకి టీడీపీ కార్యకర్తలను పంపించడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబుది సొంత మామ, టీడీపీ వ్యవస్థాకులైన ఎన్టీఆర్ పైనే చెప్పులు వేయించిన సంస్కృతి అని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ భూమిలోకి తొక్కి చంద్రబాబు పైకొచ్చారని ఆరోపించారు.

దిగజారిన టీడీపీ

దిగజారిన టీడీపీ

మోడీ హైదరాబాద్‌కు అరెస్ట్ చేస్తామంటూ గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సోము వీర్రాజు గుర్తు చేశారు. దేశంలో ఏ పార్టీ వైఖరి కూడా టీడీపీలా దిగజార లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులు, ప్యాకేజీ రూపంలో నిధులు ఇస్తామంటే చంద్రబాబు ఒప్పుకున్నారని.. హోదా అవసరం లేదని ఆయనే అన్నారని గుర్తు చేశారు.

చంద్రబాబు యూటర్న్ ఎందుకు?

చంద్రబాబు యూటర్న్ ఎందుకు?

కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ నిధులు ఇవ్వమని ఎప్పుడూ చెప్పలేదని, ఐనా చంద్రబాబు హోదా అంటూ ఎన్నికలకు ఏడాది ఉండగా యూటర్న్ ఎందుకు తీసుకున్నారో చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కేంద్రం రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలు, యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తోందని, ఇవి పూర్తి కావడానికి సమయం పడుతుందని అన్నారు. రాష్ట్రానికి నిధులు అందిస్తూ అన్ని విధాలా సాయం చేస్తున్నా తమపై నిందలు, విమర్శలు చేస్తారా? అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. నిధుల పారదర్శకత కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టమంటే ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించారు. నిరసన తెలిపే నైతిక హక్కు టీడీపీకి లేదని వీర్రాజు అన్నారు.

మేం ఉన్నది ఓట్లు, నోట్లు, సీట్ల కోసం కాదు

మేం ఉన్నది ఓట్లు, నోట్లు, సీట్ల కోసం కాదు

ఓట్లు, సీట్లు లేకునన్నా తాము ఏళ్లుగా తాము ఒకే పార్టీలో ఉన్నామని సోము వీర్రాజు అన్నారు. తాను 1980 నుంచి బీజేపీలో కొనసాగుతున్నానని చెప్పారు. తాము ఓట్లు, నోట్లు, సీట్ల కోసం రాజకీయాల్లోకి రాలేదని, దేశానికి మంచి చేయాలని ఉద్దేశంతోనే తమ పార్టీ రాజకీయాల్లో కొనసాగుతోందని చెప్పారు.

బాబు ప్రభుత్వం అవినీతి మయం

బాబు ప్రభుత్వం అవినీతి మయం

చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని సోము వీర్రాజు ఆరోపించారు. బాబు హయాంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని, లెక్కలేని అవినీతి జరుగుతోందని అన్నారు. చంద్రబాబు తనకు అవసరం వచ్చినప్పుడు వాడుకుంటూ, అవసరం తీరాక కొందరు నేతలను వదిలేశారని అన్నారు. బీజేపీపై చంద్రబాబు రాజకీయ కుట్రలు చేస్తున్నారని సోము మండిపడ్డారు. చంద్రబాబు పెట్టుబడి ఉద్యమాలు చేస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. హోదాపై టీడీపీ చేపట్టిన సైకిల్ ర్యాలీ ఎందుకు విఫలమైందో ఆలోచించుకోవాలని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన 1200 హామీల్లో కనీసం 10శాతం కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. టీడీపీ అవినీతి పార్టీ అయితే, బీజేపీ అభివృద్ధి పార్టీ అని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+