ఒవైసీ ప్రార్థనలు, చిన్నారుల శుభాకాంక్షలు(పిక్చర్స్)
హైదరాబాద్: రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. హైదరాబాద్ నగరంలోని మసీదుల్లో, పలు ప్రాంతాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాత నగరంలోని మక్కా మసీదు, మీరాలం ఈద్గా, నాంపల్లిలోని ఏక్ మినార్, ఖైతరాబాద్ మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో వేలాది మంది ముస్లింలు పాల్గొన్నారు.
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని మీరాలం ఈద్గాలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్దలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనల్లో ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.
పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సామూహిక ప్రార్థనలతో నగరంలోని పలు ప్రాంతాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. రంజాన్ సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

రంజాన్
రంజాన్ పర్వదినాన్ని మంగళవారం ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.

మీరాలం ఈద్గా
హైదరాబాద్ నగరంలోని మసీదుల్లో, పలు ప్రాంతాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

చిన్నారి ప్రార్థనలు
పాత నగరంలోని మక్కా మసీదు, మీరాలం ఈద్గా, నాంపల్లిలోని ఏక్ మినార్, ఖైతరాబాద్ మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో వేలాది మంది ముస్లింలు పాల్గొన్నారు.

ప్రార్థనలు
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని మీరాలం ఈద్గాలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్దలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ప్రార్థనలు
రంజాన్ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు చేశారు.

చిన్నారుల శుభాకాంక్షలు
రంజాన్ పర్వదినం సందర్భంగా పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటున్న చిన్నారులు.

చిన్నారుల శుభాకాంక్షలు
రంజాన్ సందర్భంగా సామూహిక ప్రార్థనలతో నగరంలోని పలు ప్రాంతాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి.

చిన్నారుల శుభాకాంక్షలు
రంజాన్ సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

అసదుద్దీన్ ఒవైసీ
ఈ ప్రార్థనల్లో ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.

ముస్లింల ప్రార్థనలు
రంజాన్ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.












Click it and Unblock the Notifications