ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు:తెలంగాణా కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు
తిరుమల:ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వి.హనుమంతరావు స్పష్టం చేశారు. తిరుమల వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన నరేంద్ర మోడీ ఇప్పుడు హామీలు నెరవేర్చకుండా దొంగ చాటుగా తిరుగుతున్నారని వీహెచ్ ఎద్దేవా చేశారు.
వచ్చే ఎన్నికల్లో గెలిచి తెలంగాణలోనూ , కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చితీరుతుందని విహెచ్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న వి.హనుమంతరావుకు టిటిడి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందచేసి పట్టు వస్త్రంతో ఆయనను సత్కరించారు.

మరోవైపు నెల్లూరులో నవనిర్మాణ దీక్ష సభలో మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అడ్డగోలు గా విభజించడంతో అప్పుల బాధతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దీక్షలు చేస్తుంటే, ఆస్తులు పొందిన తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. రాజకీయ లబ్ధికోసం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలకు 2019 ఎన్నికల్లో ఓటు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపుని చ్చారు.
2019 లోపు కృ ష్ణ, గోదావరి నదుల అనుసంధానం చేసి తీరుతామన్నారు. బీజేపీతో పొత్తు ఉన్నంతవరకు చంద్రబాబును పొగిడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పనిగట్టుకుని ఆరోపణలు చేయడం దారుణమన్నారు. రాజ్యసభలో ఆమోదం పొందిన 24 అంశాలను గాలికి వదిలేసిన కేంద్ర ప్రభుత్వం, బిల్లులో లేని అంశాలకు నిధులు కేటాయించడం దారుణమన్నారు. ప్రధాని మోదీ ప్రజా స్వామ్యాన్ని కాలరాస్తూ నియంతలా వ్యవహ రిస్తున్నారని ఆరోపించారు.
-
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications