తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ వారికి ముఖ్య గమనిక
హైదరాబాద్, తిరుపతి, విజయవాడ నుంచి జులై, ఆగస్టు నెలల్లో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఆగస్టు వరకు నడుస్తాయని, వీటిని పొడిగించే విషయమై ఆ నెలలోనే పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తామని ప్రకటించింది.
నెం. 07605 తిరుపతి నుంచి అకోలా వరకు ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతిలో బయల్దేరి తర్వాత రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు అకోలా చేరుకుంటుంది. జులై 7 నుంచి ఆగస్ట్ 25 వరకు పొడిగించారు.

నెం. 07606 అకోలా నుంచి తిరుపతి వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఉదయం 8.10 గంటలకు అకోలాలో బయల్దేరి తర్వాత రోజు ఉదయం 6.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. జులై 9 నుంచి ఆగస్ట్ 27 వరకు పొడిగించారు.
నెం. 07091 కాజీపేట్ నుంచి తిరుపతి వరకు ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఉదయం 11.00 గంటలకు కాజీపేట్‌లో బయల్దేరి రాత్రి 10.10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. కాజీపేట్-తిరుపతి రైలును జులై 4 నుంచి ఆగస్ట్ 28 వరకు పొడిగించారు.
నెం. 07092 తిరుపతి నుంచి కాజీపేట్ వరకు ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. రాత్రి 11.40 గంటలకు తిరుపతిలో బయల్దేరి తర్వాత రోజు ఉదయం 10.45 గంటలకు కాజీపేట్ చేరుకుంటుంది. జులై 4 నుంచి ఆగస్ట్ 29 వరకు పొడిగించారు.
నెం. 07631 హైదరాబాద్ నుంచి నర్సాపూర్ వరకు ప్రతి శనివారం అందుబాటులో ఉంటుంది. రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి తర్వాత రోజు ఉదయం 8.35 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. హైదరాబాద్-నర్సాపూర్ రైలును జులై 1 నుంచి ఆగస్ట్ 26 వరకు పొడిగించారు.
నెం. 07632 నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. రాత్రి 8.00 గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరి తర్వాత రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. నర్సాపూర్-హైదరాబాద్ రైలును జులై 2 నుంచి ఆగస్ట్ 27 వరకు పొడిగించారు.

నెం. 07643 హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి తర్వాత రోజు ఉదయం 10.00 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. హైదరాబాద్-తిరుపతి రైలును జులై 3 నుంచి ఆగస్ట్ 28 వరకు పొడిగించారు.
నెం. 07644 తిరుపతి నుంచి హైదరాబాద్ వరకు ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 3.00 గంటలకు తిరుపతిలో బయల్దేరి తర్వాతరోజు ఉదయం 5.00 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. తిరుపతి-హైదరాబాద్ రైలును జులై 4 నుంచి ఆగస్ట్ 29 వరకు పొడిగించారు.












Click it and Unblock the Notifications