Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాకినాడ, చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు- హాల్ట్ స్టేషన్లు: నేటి నుంచే బుకింగ్

అయ్యప్పస్వామి భక్తుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేరళలోని వివిధ స్టేషన్లకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్నారు దక్షిణ మధ్య రైల్వే. ఈ క్రమంలో తాజాగా కాకినాడ, చర్లపల్లి నుంచి ఈరైళ్లు రాకపోకలు సాగించనున్నారు. మకరవిళక్కు పండుగ సందర్భంగా శబరిమలకు వెళ్లే భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. శబరిమల యాత్రీకుల తాకిడి నేపథ్యంలో ఈ నెల 15, 16 తేదీల్లో ఈ ఇవి అందుబాటులో ఉంటాయి.

కొల్లం నుంచి..

  • ఈ నెల 15వ తేదీన వేకువ జామున 3:30 గంటలకు కొల్లం నుంచి బయలుదేరే నంబర్ 06065 ప్రత్యేక రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు కాకినాడ టౌన్ కు చేరుకుంటుంది.
Special Trains to Clear Makaravilakku Pilgrim Rush from Kakinada and Charlapalli to Kerala
  • 16వ తేదీన సాయంత్రం 6 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరే నంబర్ 06066 ప్రత్యేక రైలు మరుసటి రోజు రాత్రి 10:30 గంటలకు ఎర్నాకుళానికి చేరుకుంటుంది. ఈ రైలు కొల్లం బదులుగా ఎర్నాకుళం వరకే నడుస్తుంది.
  • కాయంకుళం, చెంగన్నూర్, తిరువళ్ల, చంగనస్సేరి, కొట్టాయం, ఎర్నాకుళం జంక్షన్, ఎర్నాకుళం టౌన్, ఆలువా, త్రిశూర్, పాలక్కాడ్, పొదనూర్, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్ పేట, కాట్పాడి, పెరంబూరు, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.

తిరువనంతపురం సెంట్రల్ నుంచి..

  • ఈ నెల 15వ తేదీన తెల్లవారు జామున 4:10 నిమిషాలకు తిరువనంతపురం సెంట్రల్ నుంచి బయలుదేరే నంబర్ 06067 ప్రత్యేక రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
  • 16వ తేదీన చర్లపల్లి నుంచి రాత్రి 9:45 నిమిషాలకు బయలుదేరే నంబర్ 06068 ప్రత్యేక రైలు మూడో రోజు ఉదయం 8 గంటలకు తిరువనంతపురం సెంట్రల్ కు చేరుకుంటుంది.
  • కొల్లం, చెంగన్నూర్, తిరువళ్ల, చంగనస్సేరి, కొట్టాయం, ఎర్నాకుళం జంక్షన్, ఎర్నాకుళం టౌన్, ఆలువా, త్రిశూర్, పాలక్కాడ్, పొదనూర్, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్ పేట, కాట్పాడి, పెరంబూరు, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, ఖాజీపేట్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+