Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చెన్నై నుంచి బెంగళూరు మీదుగా ఏపీకి ప్రత్యేక రైళ్లు

Special Trains: పండగ సీజన్ లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ నెల 23వ తేదీన పుట్టపర్తి సత్యసాయిబాబా జయంతి. ఇది ఆయన శతజయంతి ఉత్సవాలు. ఇందులో పాల్గొనడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పుట్టపర్తికి చేరుకోనున్నారు. ఈ శత జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించడానికి ప్రశాంతి నిలయం ప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేస్తోన్నారు. సత్యసాయి సేవా సంస్థలు ఆ రోజున పలు ఆధ్యాత్మిక సమావేశాలు, సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నాయి.

Special trains to Guntakal from MGR Chennai Central

ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన భక్తులు పుట్టపర్తిని సందర్శించడానికి వీలుగా రైల్వే అధికారులు ప్రత్యేకంగా రెండు రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి ప్రశాంతి నిలయం మీదుగా గుంతకల్ వరకు ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. దీనికి సంబంధించిన టైమ్ టేబుల్ వివరాలను అధికారులు విడుదల చేశారు.

  • ఈ నెల 19, 21 తేదీల్లో బుధ, శుక్రవారాల్లో రాత్రి 11:50 నిమిషాలకు డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరే నంబర్ 06091 ప్రత్యేక రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 2:15 నిమిషాలకు గుంతకల్ కు చేరుకుంటుంది.
  • ఈ నెల 20, 22 తేదీల్లో అంటే గురు, శనివారాల్లో సాయంత్రం 5:30 నిమిషాలకు గుంతకల్ నుంచి బయలుదేరే నంబర్ 06092 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 9:45 నిమిషాలకు డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కు చేరుకుంటుంది.
  • పెరంబూరు, తిరువళ్లూరు, అరక్కోణం జంక్షన్, కాట్పాడి జంక్షన్, జోలర్ పేట, కుప్పం, బంగారుపేట, వైట్ ఫీల్డ్, కృష్ణరాజపురం, యలహంక, హిందూపురం, శ్రీసత్యసాయి ప్రశాంతినిలయం, ధర్మవరం, అనంతపురం, గుత్తి మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+