ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగం కావాలి...ఎపి నంబర్ వన్ గా ఉండాలి:సిఎం చంద్రబాబు
విజయవాడ: ప్రతి ఒక్కరి జీవితంలో స్పోర్ట్స్ ఒక భాగం కావాలని...స్పోర్ట్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడం సమాజానికి మంచిదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.
విజయవాడలో నిర్మించనున్న అంతర్జాతీయ క్రీడా ప్రాంగణానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ నేతలకు రాష్ట్ర, దేశస్థాయిలో మాత్రమే గుర్తింపు వస్తుందని క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు. ఐకాన్‌గా ఎదుగుతారని గుర్తు చేశారు. ప్రపంచాన్ని జయించే శక్తి క్రీడాకారులకు ఉంటుందని అన్నారు.

ఎపినే...నంబర్ వన్
ఆంధ్రప్రదేశ్ దేనిలోనైనా నంబర్ వన్ గా ఉండాలని...అంతే కానీ వేరే స్థానంలో ఉండటానికి వీల్లేదని చెప్పారు. ఎపి దేనిలోనైనా నంబర్ వన్‌గా ఉండాలన్నదే తన తపన అన్నారు. రాష్ట్రంలో అద్భుతమైన ప్లే గ్రౌండ్‌లను నిర్మించేందుకు మరమ్మతులు చేపడుతున్నామన్నారు.

ఆనాడు...దూరదృష్టి
ఆనాడు దూరదృష్టితో హైదరాబాద్ చుట్టూ ఎల్బీనగర్, యూసఫ్ గూడ, మేడ్చల్‌లలో మౌలిక సదుపాయాలను కల్పించామన్నారు. తాను చూపిన చొరవతోనే గోపీచంద్ అకాడెమీ అంతర్జాతీయ క్రీడాకారులను అందివ్వగలుగుతుందన్నారు. ఇవాళ ప్రఖ్యాత క్రికెటర్ అనిల్ కుంబ్లే సహకారంతో ప్రారంభిస్తున్న ప్రాజెక్ట్ గాండీవ ద్వారా అత్యుత్తమ క్రీడాకారులను దేశానికి అందిస్తామన్నారు.

అంతర్జాతీయ క్రీడలు...సైతం
ఈ ప్రాజెక్ట్ లో జాతీయ, అంతర్జాతీయ క్రీడలు ఉండేలాగా చూస్తామన్నారు. బాగా ఆడేవాళ్లకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వాళ్లను గుర్తించి.. ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ఎప్పటికప్పుడు పాలసీలపై పునఃసమీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు క్రీడలతో పాటు...చదువుల్లో ముందుండాలని సూచించారు.

త్వరలో...సిఎం కప్
త్వరలో సీఎం కప్ ప్రారంభించి.. క్రీడల్లో ప్రతిభ కనపరిచినవారికి ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ప్రముఖ క్రీడాకారులు కుంబ్లే, కరణం మల్లేశ్వరి, కోనేరు హంపి తదిదరులు పాల్గొన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications