శ్రీలీల.. రికార్డ్ బ్రేకింగ్ రెమ్యునరేషన్
పెళ్లి సందడి సినిమాతో కథానాయికగా పరిచయమైన శ్రీలీల వరుసగా అవకాశాలను దక్కించుకుంటున్నారు. చిత్ర పరిశ్రమ అంటేనే.. సెంటిమెంట్ కు నిలయంగా ఉంటుంది. శ్రీలీల నటిస్తే సినిమా పక్కగా హిట్ అవుతుంది అనే సెంటిమెంట్ బలపడటంతో నిర్మాత, దర్శకులు ఆమె కాల్షీట్ల కోసం క్యూ కడుతున్నారు. కెరీర్ ప్రారంభంలో చిన్న హీరోలతో నటించినప్పటికీ గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు సరసన ప్రధాన కథానాయిక అవడంతో ప్రాజెక్టులన్నీ ఈ అమ్మడి ఒళ్లోకొచ్చి వాలుతున్నాయి.
తాజాగా శ్రీలీల చేతిలో అరడజను ప్రాజెక్టులున్నాయి. ఇటీవలే వెంకీ కుడుముల, నితిన్, రష్మిక కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన సినిమా నుంచి రష్మిక తప్పుకుంది. ఆమె స్థానంలో శ్రీలీలను నటించమంటూ నిర్మాత, దర్శకులు అప్రోచ్ అయ్యారు. అయితే డేట్లు సర్దుబాటు చేయడం కష్టం కావడంతో ఎలాగైనా సినిమా చేస్తానని.. కాకపోతే రెమ్యునరేషన్ డబులివ్వాలని కోరినట్లు వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయితేనే ఈ సినిమా చేయగలనని, కాకపోతే రెండుకోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వాలని ఈ భామ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నప్పటికీ డబుల్ రెమ్యునరేషన్ విషయమై ఆలోచించాలని నిర్మాత, దర్శకులు కోరినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కోటిరూపాయల్లోపు పారితోషికాన్ని అందుకుంటున్న శ్రీలీల ఏకంగా రెండు కోట్లరూపాయలు అడగడం ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు కార్పొరేట్ బ్రాండ్లు, ఇతర కంపెనీలకు సైతం బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు ఆమె సిద్ధమైనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications