వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజా వాయిస్‌ ట్యాంపర్, ప్రెస్ మీట్స్ పెట్టి జగన్‌పై స్పీకర్ విమర్శలు: శ్రీకాంత్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అసెంబ్లీ జీరో అవర్‌లో ఎప్పుడూ చర్చ జరగలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్పీకర్‌కు ప్రతిపక్ష నేత జగన్‌ రాసిన లేఖపై సమాధానం రాలేదని తెలిపారు.

అసెంబ్లీలో ఎమ్మెల్యే రోజా వాయిన్‌ను ట్యాంపర్‌ చేశారని ఆరోపించారు. మంత్రులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల వ్యాఖ్యలపై చర్చిద్దామంటే అంగీకరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్‌ ప్రెస్‌మీట్‌లు పెట్టి తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను విమర్శిస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.

అసెంబ్లీలో సభ్యుల ప్రవర్తనపై నియమించిన డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కమిటీ ఏక పక్ష నిర్ణయం తీసుకునేలా ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో నియమించిన కమిటీ సమావేశం సోమవారం జరిగిం

 Srikanth Reddy accuse Roja's voive tampered
ది.

స్పీకర్‌కు నివేదిక ఇచ్చేందుకు చివరిసారిగా కమిటీ ఈ నెల 19వ తేదీన సమావేశం కానుంది. తాను లేవనెత్తిన అంశాలకు కమిటీ నుంచి సరైన సమాధానం రాలేదని ఆయన అన్నారు. తమ అభ్యంతరాలను కమిటీ చర్చించలేదని, కేవలం తమ పార్టీని లక్ష్యం చేసుకుని చర్చించిందని ఆయన చెప్పారు. సోషల్ మీడియాలో లీకైన వీడియోలపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేద్దామని కోరినా కమిటీ ముందుకు రాలేదని చెప్పారు.

బుద్ధప్రసాద్ కమిటీతో తమకు న్యాయం జరిగేలా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో తమ పార్టీని దారుణంగా విమర్శించిన టిడిపి సభ్యులపై కమిటీలో చర్చించకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. కమిటీతో న్యాయం జరగదనే ఉద్దేశంతోనే రోజా హైకోర్టును ఆశ్రయించినట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

English summary
YSR Congress party MLA Srikanth Reddy accused that MLA Roja's vioce has been tampered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X