TTD: శ్రీవారి భక్తులకు కన్నుల పండుగ- అరుదైన ఛాన్స్, తొలిసారి..!!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వేసవి సెలవులు ప్రారంభం కానుండ టంతో రద్దీ పెరిగే అవకాశం ఉంది. ప్రతీ ఏటా తరహాలోనే వేసవిలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో శ్రీవారి సాలికట్ల తెప్పోత్సవాలు మొదలయ్యాయి. మాడవీధుల్లో ఉత్సవ మూర్తుల ఊరేగింపు నిర్వహించారు. ఈ నెల 15న అమరావతిలో తొలిసారి వైభవంగా శ్రీనివాస కల్యాణ్ కన్నుల పండుగగా నిర్వహించేందుకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది.

సాలికట్ల తెప్పోత్సవాలు
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుద్ దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.

Srivari Salakatla Teppotsavam in Tirumala Utsavamurtis procession through the four mada streets

ఒంటిమిట్ట కల్యాణం
ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. భక్తులకు అందరికీ ముత్యాల తలంబ్రాలు, ప్రసాదాలు అందేంచేలా చర్య లు చేపట్టాలన్నారు. ప్రతి ఏడాది సీతారాముల కళ్యాణానికి భక్తుల సంఖ్య పెరుగుతోందని, భక్తుల తాకిడికి తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించాలన్నారు. టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ మరియు పోలీసులు సమన్వయంతో పనిచేయాలన్నారు. భక్తులకు సేవలు అందించేందుకు అవసరమైన శ్రీవారి సేవకులను ఏర్పాటు చేయాలని సూచించారు.

అమరావతి వేదికగా
అమరావతి లోని వేంకట పాలెంలో మార్చి 15వ తేదీన జరుగనున్న శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని, స్వామి వారి కళ్యాణాన్ని అందరూ చూసి స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అమరావతిలోని టిటిడి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో తొలిసారి శ్రీనివాస కళ్యాణోత్సవం జరుగుతోందని, భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేసారు. అమరావతిలో జరిగే శ్రీనివాస కల్యాణం కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వంలోని ముఖ్యులు.. భారీగా శ్రీవారి భక్తులు తరలి రానున్నారు. కన్నుల పండుగ గా ఈ వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+