స్ట్రీట్ ఫైట్: మృతుడు నబీల్ తండ్రిని బెదిరించారా? (ఫొటోలు)
హైదరాబాద్: డబ్ల్యు డబ్ల్యుఎఫ్ స్టయిల్ స్ట్రీట్ ఫైట్‌లో ప్రాణాలు కోల్పోయిన మొహమ్మద్ నబీల్ తండ్రి దస్తగిరిని నబీల్ మిత్రులు బెదిరించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రమాదం వల్లనే నబీల్ మరణించాడని నమ్మించడానికి వారు తీవ్ర ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు.
నబీల్ బైక్ స్టంట్ చేశాడని, ఆ సయమంలో ఫిట్స్ వచ్చి మరణించాడని నబీల్ కుటుంబ సభ్యులకు వారు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నబీల్ తండ్రి దస్తగిరితో వారు గొడవ కూడా పడినట్లు చెబుతున్నారు.
నబీల్ మైనర్ కాబట్టి, డ్రైవింగ్ లైసెన్స్ లేదు కాబట్టి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు వస్తాయని నచ్చజెప్పేందుకు కూడా వారు ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. నబీల్ కుటుంబ సభ్యులతోనే అతని అంత్యక్రియలు జరిగిన తర్వాత కూడా ఉన్నారు. కుటుంబ సభ్యులకు అనుమానం వస్తోందా అనే విషయాన్ని పసిగట్టడానికి వారు ప్రయత్నించినట్లు చెబుతున్నారు.

మృతుడు ఇతనే..
కుస్తీ పోటీల పేరుతో పిడిగుద్దులకు గురై మరణించిన నబీల్ ఇతనే..

సందేహాలు తీర్చుకోవడానికి...
గత కొద్ది రోజులుగా నిందితులంతా ఒకరి ఇంట్లో కలుసుకుని తమ సందేహాలను తొలగించడానికి ఏం చేయాలనే విషయంపై చర్చలు జరుపుతూ వచ్చారని సమాచారం.

3న ఫోన్ వచ్చింది...
ఈ నెల 3వ తేదీన తనకు ఫోన్ వచ్చిందని, బైక్ స్టంట్ చేస్తూ నబీల్ గాయపడ్డాడని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తనకు చెప్పారని దస్తగిరి అంటున్నారు.

పొంతన లేకపోవడంతో..
నబీల్ మిత్రులు చెబుతున్న విషయాల మధ్య పొంత లేకపోవడంతో పాటు నబీల్ తల్లి తల ఉబ్బి ఉండడాన్ని గమనించిందని, మూడు రోజుల తర్వాత ఒమర్‌తో దస్తగిరి వివాదానికి దిగాడని చెబుతున్నారు.

కావాలనే...
నబీల్ హత్యకు ఓ మిత్రుడు కుట్ర చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని అంటున్నారు.

పోటీల్లో గెలిచాడు..
నబీల్ కుస్తీ పోటీలో గెలిచిన తర్వాత పిడిగుద్దులకు గురయ్యాడు. ఏం జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కాల్ లిస్ట్ ఆధారంగా...
నిందితుల మొబైల్ కాల్ లిస్టులను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. నబీల్ మృతికి సంబంధించిన కీలకమైన విషయాలు బయటపడవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications