విద్యార్థిపై టీచర్ దారుణం, భర్తను చితకబాదిన భార్య

ఉపాధ్యాయుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఘటన పైన విచారణ చేపట్టారు. స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే, ఇది ప్రమాదవశాత్తు జరిగిందని, తాను ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేయలేదని ఉపాధ్యాయుడు చెబుతున్నారు.
భర్తను చితకబాదిన భార్య
ప్రకాశం జిల్లాలో ఓ భార్య భర్తను చితకబాదారు. తన భర్తకు మరో యువతితో వివాహేతర సంబంధం ఉందని తెలిసిన ఆమె, అతనిని పట్టుకొని చితకబాదారు. అనంతరం భర్తను పోలీసులకు అప్పగించారు.
బద్వేలు ఆర్టీసీ గ్యారేజీలోకి వర్షపు నీరు
కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా బద్వేలు ఆర్టీసీ గ్యారేజీ జలమయమైంది. డిపో చుట్టూ ఉన్న ఖాళీ స్థలం కబ్జాకు గురవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయింది. దీనికి తోడు డ్రైనేజీలు ఏర్పాటు చేసిన చోటు అక్రమకట్టడాలను నిర్మించారు. వర్షపు నీటితో గ్యారేజీలో బస్సుల మరమ్మతులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
కౌన్సిల్‌లో టిడిపి, వైసీపీ వాగ్యుద్ధం
తాము ప్రతిపాదించిన తీర్మానాలను మార్చివేశారని ఆరోపిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు గురువారం ఉదయం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఆందోళనకు దిగారు. దీంతో టిడిపి, వైకాపా సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో సమావేశాన్ని కొద్దిసేపు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications