పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పిన వినలేదు మామా..టీడీపీకి ఘోర అవమానమే..!
విదేశీ గడ్డపై విద్యా కాంతులు నింపాలని వెళ్లిన కొందరు తెలుగు విద్యార్థులు, తమ అతి ప్రవర్తనతో ఇప్పుడు నవ్వులపాలవుతున్నారు. యూనివర్సిటీల ప్రాంగణాలు, ఎన్నో ఏళ్ల కష్టం తర్వాత డిగ్రీ పట్టాలు అందుకునే వేదికలు... కానీ కొందరు మాత్రం వీటిని రాజకీయ ప్రదర్శనల కోసం వాడుకుంటున్నారు.
https://t.co/AeJk8oQfIM
— Krishna🚩🚩🚩 (@krishna20222024) May 18, 2025
Idhi kanapadaledha ra. https://t.co/AeJk8oQfIM
గ్రాడ్యుయేషన్ డే నాడు, ఎంతో గర్వంగా తమ డిగ్రీలు అందుకుంటున్న సమయంలో, కొందరు విద్యార్థులు హఠాత్తుగా రాజకీయ పార్టీల జెండాలను ఎగురవేస్తున్నారు. ఈ చర్యతో అక్కడి ప్రొఫెసర్లు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. చదువు పూర్తయిన ఆనందంలో ఉండాల్సిన వేడుకను, కొందరు తమ రాజకీయ పైత్యాన్ని ప్రదర్శించేందుకు వేదికగా మార్చుకోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా విద్యార్థుల చేతుల్లోంచి జెండాలను లాగేసి పక్కన పడేస్తున్నారు.

ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. "చదువుకోవడానికి వెళ్లారా లేక పిచ్చి చేష్టలు చేయడానికి వెళ్లారా?" అంటూ నిలదీస్తున్నారు. మరికొందరైతే, "ఇక్కడ చదవకుండా తిరిగితే విదేశాలకు పంపిస్తే అక్కడ కూడా ఇదే తంతు" అంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.
నిన్న టీడీపీ..
— Telugu Scribe (@TeluguScribe) May 18, 2025
ఈరోజు జనసేన.. pic.twitter.com/WfRPXkyamh
ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అభిమానులే ఇలాంటి చర్యలకు పాల్పడుతుండటం గమనార్హం. విద్యార్థులు టీడీపీ , జనసేన జెండాలను ఒకేసారి ప్రదర్శించే ప్రయత్నం చేయడం మరింత విడ్డూరంగా మారింది. ప్రొఫెసర్ వెంటనే ఆ విద్యార్థుల ప్రయత్నాన్ని అడ్డుకుని జెండాను లాక్కోవడం ఈ వీడియోల్లో కనిపించింది.
TDP
— Mahesh 🇮🇳 (@Mahesh_2299) May 18, 2025
Jenasena
BRS
Mudu video's kalipi Post Chey anna pic.twitter.com/kUCL7MdoFZ
ఈ ఘటనలు కేవలం ఆ విద్యార్థుల వ్యక్తిగత పరువునే కాకుండా, విదేశాల్లో ఉన్న ఇతర తెలుగువారి పరువును కూడా దిగజారుస్తున్నాయని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. "ఒకరిని చూసి మరొకరు తయారవుతున్నారు" అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి వెళ్లినవారు ఇలాంటి రాజకీయ ప్రదర్శనలతో తమ ఉద్దేశ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications