వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దళిత మంత్రికి ఛాన్స్ ఇవ్వరా.. మరీ కొడాలికి ఎందుకు.. వర్ల రామయ్య పైర్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఏర్పాటు చుట్టూ హడావిడి నెలకొంది. సీఎం జగన్ కసరత్తు చేస్తుండగా.. సజ్జల రామకృష్ణా రెడ్డి సహకారం అందిస్తున్నారు. పాత వారు దాదాపు 10 మందిక అవకాశం అని రూమర్లు వస్తున్నాయి. కానీ దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. కాసేపటి క్రితం కూడా సీఎం జగన్‌తో సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం అయ్యారు. పాత, కొత్త కలయికపై చర్చిస్తున్నారు. ఇంతవరకు ఓకే.. కానీ పదవీ ఊడేవారి గురించి కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ వస్తోన్న జాబితాలో మాత్రం సుచరిత పేరు లేదు. దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు.

నోరు లేని దళిత మంత్రి

నోరు లేని దళిత మంత్రి

ఏపీ కొత్త మంత్రుల జాబితా మధ్యాహ్నం గవర్నర్‌కు పంపే అవకాశం ఉంది. ఆ అంశంపై టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య కామెంట్ చేశారు. 'ముఖ్యమంత్రి గారూ.. అంటూ కామెంట్స్ స్టార్ట్ చేశారు. నోరు లేని దళిత హోం మంత్రి సుచరిత గారిని తొలగించడం భావ్యం కాదన్నారు. ఆమెను కొనసాగిస్తే బాగుండేదని పేర్కొన్నారు. కానీ కొత్త‌ మంత్రి మండలిలో నోరు తప్ప ఏమీలేని బూతుల మంత్రి కొడాలి నానిని కొనసాగించాలని చూడడం మంచిది కాదు అని సజెస్ట్ చేశారు. దీనిపై ఆలోచించాలని ఆయన ట్వీట్ చేశారు.

మాట మీద నిలబడండి సార్

మాట మీద నిలబడండి సార్

అంతేకాదు అన్న మాట మీద నిలబడి అందరినీ తీసేయాలని వర్ల రామయ్య సూచించారు. మాట తప్పకండి, మడమ కూడా తిప్ప‌కండి. ఎవరి సలహాలూ వినకండి అని వ‌ర్ల రామ‌య్య ట్వీట్ చేశారు. ప్రస్తుతం వస్తోన్న ఊహాగానాల ప్రకారం సుచరితకు మాత్రం ప్లేస్ లేనట్టే ఉంది. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన వర్ల తరామయ్య స్పందించారు. ఆమెకు అవకాశం ఇవ్వాల్సి ఉండేదని చెప్పారు. దళిత మహిళ నేతకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

 కొత్త, పాతల కలయిక

కొత్త, పాతల కలయిక

ఈ నెల 11వ తేదీన (సోమవారం) కొత్త మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. కొత్త, పాతల కలయికతో మంత్రివర్గం కొలువుదీరనుంది. అయితే తొలుత ఐదారుగురు పాతవారికి అవకాశం అనే రూమర్ వచ్చింది. అదీ చివరికీ పది మందికి చేరింది. ఇప్పటికే సీఎం జగన్ జాబితా ఖరారు చేశారు. దానిని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు పంపిస్తారు. అంతుకుముందే 24 మంత్రుల రాజీనామాను గవర్నర్ ఆమోదించనున్నారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కోసం ఆహ్వానిస్తారు.

English summary
mekathoti sucharitha may not get berth in cabinet tdp leader varla ramaiah said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X