మేం రావొద్దని రాజ్యాంగంలో లేదు, చిరు బిజినెస్ చేయట్లేదా: పవన్‌కు సుజన

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుల పైన జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ఘాటు వ్యాఖ్యలకు కేంద్రమంత్రి సుజనా చౌదరి మంగళవారం కౌంటర్ ఇచ్చారు.

వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి రావొద్దని రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగా మంచి సలహాలు ఇస్తే స్వీకరించేందుకు తాము ఎప్పుడు సిద్ధంగానే ఉంటామని చెప్పారు. మంచి సలహాలు ఇస్తే మంచిదని చెప్పారు. చిరంజీవి కూడా ఎంపీయేనని, ఆయన వ్యాపారాలు చేయడం లేదా అని ప్రశ్నించారు.

Sujana Chowdary counter to Pawan Kalyan

ప్రత్యేక హోదా పైన కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తాము భావిస్తున్నామని చెప్పారు. ఆంధ్రా ఎంపీలు ఎలా పని చేస్తున్నారో నియోజకవర్గ ప్రజలు నిర్ణయిస్తారని ఆయన చెప్పారు. తాము వ్యాపారం చేస్తున్నామా లేదా అన్నది కాదని, అది నీతిమంతంగా చేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యమని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+