సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్ అప్డేట్స్ - ఉత్కంఠ..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేసుల్లో సుప్రీంకోర్టు నిర్ణయాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ ఈ రోజు (గురువారం) విచారణకు రానుంది. విచారించే జాబితాతో దీనిని 11వ నెంబర్ కేసుగా పేర్కొన్నారు. అయితే, క్వాష్ పిటీషన్ పై తీర్పు వెలువరించిన తర్వాతే ఈ బెయిల్ పిటీషన్ పై విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేయటంతో .. క్వాష్ పిటీషన్ పైన తీర్పు విషయంలో ఆసక్తి కనిపిస్తోంది.

నేడు సుప్రీంలో విచారణ:చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ పైన ఈ రోజు సుప్రీంలో విచారణ జరగనుంది. గత నెలలో ఈ పిటీషన్ విచారణ వేళ సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు పై స్కిల్ కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పైన తీర్పు వెలువరించిన తరువాతనే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిలల్ పిటీషన్ పై విచారణ చేపడతామని జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. తదుపరి విచారణ ఈ రోజు (9వ తేదీ)కి వాయిదా వేసింది. దీంతో, ఈ రోజు సుప్రీం ధర్మాసనం ఈ రెండు పిటీషన్ల విషయంలో ఏం చెప్పబోతోందనేది ఆసక్తికరంగా మారుతోంది.

Supreme Court to hear Chandra Babu anticipatory bail petition in Fiber Case, Chances for Judgement on Quash

క్వాష్ తీర్పు పై క్లారిటీ:స్కిల్ కేసులో తీర్పు రిజర్వ్ కావటంతో జడ్జిమెంట్ ఇస్తారా..లేక ఎప్పుడు వెల్లడించేది స్పష్టత ఇస్తారా అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గత నెల 17న స్కిల్ కేసులో సుప్రీం తీర్పు రిజర్వ్ చేసింది. ఈ రోజు సుప్రీంలో లిస్టు అయిన కేసుల్లో ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు లిస్ట్ అయింది. కానీ క్వాష్ పిటిషన్ పై తీర్పు మాత్రం ఇంకా లిస్ట్ కాలేదని తెలుస్తోంది. సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణకు వచ్చినప్పుడు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు గురించి ప్రస్తావించే అవకాశం ఉంది. అలాగే.. ఈ కేసులు విచారణ జరుగుతున్న సమయంలోనే చంద్రబాబుపై దాఖలైన మద్యం, ఇసుక కేసుల గురించీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

కొనాసాగుతున్న ఉత్కంఠ:దీంతో, చంద్రబాబు పైన స్కిల్ కేసులో 17ఏ చుట్టూ వాదనలు జరిగాయి. చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. 17ఏ సవరణకు ముందే ఈ కేసు నమోదు అయిందని..విచారణ ప్రారంభమైందని సీఐడీ తరపు న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో 17ఏ కీలకం కావటంతో ఈ సాంకేతిక అంశం మొత్తం కీలకంగా మారుతోంది. చంద్రబాబును పైన నమోదైన ఇతర కేసుల్లోనూ ఈ అంశం కీలకంగా మారుతుందనే వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పైన ఉన్న చంద్రబాబు రెగ్యుల్ బెయిల్ పిటీషన్ రేపు ( 10వ తేదీ) హైకోర్టులో విచారణకు రానుంది. మొత్తంగా ఈ రోజు సుప్రీంలో ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+