వైఎస్ జగన్ చేతికి సర్వే రిపోర్ట్!

వచ్చే ఎన్నికలు ఎంత ప్రతిష్టాత్మకమో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే ఆయన 150 మంది ఎమ్మెల్యేలున్నప్పటికీ రాజీపడటంలేదు. రెండోసారి ఎట్టి పరిస్థితుల్లోను విజయం సాధించి అధికారంలోకి రావాలనుకుంటున్న జగన్ 175 సీట్లు గెలుచుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకనుగుణంగా ఇప్పటినుంచే వ్యూహరచన చేస్తున్నారు.

కీచులాటలు నివారించాలంటే ఏం చేయాలి?

కీచులాటలు నివారించాలంటే ఏం చేయాలి?

రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పరిస్థితి? మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, పార్టీ ఎక్కడ బలహీనపడుతోంది? పడితే అక్కడ తీసుకోవాల్సిన చర్యలు, నియోజకవర్గాల్లో కుమ్ములాటలు, కీచులాటలుంటే నివారించడానికి ఏం చేయాలి? ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర విషయాలపై ఆయన సర్వే చేయించుకున్నారు. తాజాగా జగన్ చేతికి సర్వే నివేదిక అందింది.

టీడీపీలోని గ్రూపుల పరిస్థితి?

టీడీపీలోని గ్రూపుల పరిస్థితి?


నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎంతవరకు బలపడింది? బలపడటానికి కారణం? టీడీపీలోని గ్రూపుల పరిస్థితి? ప్రస్తుత ఎమ్మెల్యేను నియోజకవర్గంలో కొనసాగించాలా? మార్చాలంటే అందుకు కారణాలు? సచివాలయాల పనితీరు? వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులంతా పాల్గొంటున్నారా? ఈ కార్యక్రమం గురించి ప్రజలేమనుకుంటున్నారు? వీరంతా ప్రజలతో కలుస్తున్నారా? ప్రభుత్వ ఉద్దేశం నెరవేరుతుందా? ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయం?... తదితర అంశాలపై కూడా అధ్యయనం చేసిన నివేదికను సర్వే సంస్థ అందించినట్లు తెలుస్తోంది.

వివరాలను క్రోడీకరిస్తున్నజగన్

వివరాలను క్రోడీకరిస్తున్నజగన్

వివరాలను తెప్పించుకున్న జగన్ వీటిని క్రోడీకరించే పనిలో పడ్డారు. ఇప్పటికే మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా మంచి పనితీరు మార్చకపోతే మార్చేస్తానని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. తాను తెప్పించుకున్న నివేదిక ప్రకారం మంత్రివర్గంతోపాటు ఎమ్మెల్యేల్లో కూడా అత్యధిక సంఖ్యలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోందని, జగన్ కూడా ఊహించని స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న అమాత్యులకు నియోజకవర్గాలను మార్చి పోటీచేయించాలా? లేదంటే సీట్లు నిరాకరించాలా? ఎమ్మెల్యేలను మార్చి ఇన్ ఛార్జిలుగా, పరిశీలకులుగా ఉన్నవారిలో అభ్యర్థిని ఎంపిక చేద్దామా? అనే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు.

ఎన్నికలు జరిగే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందా? లేదంటే వీరిపై వ్యతిరేకతలో ఏమైనా మార్పు చోటుచేసుకుంటుందా? అనే విషయంపై స్పష్టత రావాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+