పొత్తులపై పవన్ కొత్త సిగ్నల్స్ - చంద్రబాబు అలర్ట్..!?
పొత్తులపై పవన్ కొత్త సిగ్నల్..అలర్ట్ అవుతున్న చంద్రబాబు, మారుతున్న రాజకీయం
పవన్ కల్యాణ్ ఎన్నికల్లో ఒంటరి పోరా..పొత్తుతో వెళ్తారా. జనసేనాని ఆలోచన ఏంటి. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరితో పొత్తు ఉంటుందనే దాని పైన పవన్ నేరుగా తేల్చి చెప్పటం లేదు. అటు బీజేపీ తాము టీడీపీ తో కలిసే లేదని తేల్చి చెబుతోంది. టీడీపీ ఇంకా వేచి చూసే ధోరణితో ఉంది. పవన్ కూడా టీడీపీతోనే వెళ్తారనే నిర్ణయానికి వచ్చేసింది. ప్రజలతోనే తమ పొత్తు అంటూ స్పష్టంగా చెబుతోంది. వైసీపీ తమది సింగిల్ ఫైట్ అని తొలి నుంచి స్పష్టం చేస్తోంది. ఇతర పార్టీలు అంతస్పష్టంగా ఉన్నా పవన్ ఎందుకు డైలమాలో ఉన్నారు. ఇప్పుడు పవన్ తీసుకున్న తాజా నిర్ణయంతో చంద్రబాబు అలర్ట్ అవుతున్నారు.

పొత్తులపై పవన్ ఓపెన్ ఆఫర్
ఈ సారి తెలంగాణలోనూ పోటీ చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ఎన్ని స్థానాల్లో పోటీ చేసేదీ వెల్లడించారు. తమ ఓటు బ్యాంకు చీలకుండా ఒక్కరికే దక్కేలా చూడాలనేది తన లక్ష్యమని చెప్పారు. ఇదే సమయంలో ఎవరైనా పొత్తులకు వస్తే చూద్దామంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఏపీలో బీఆర్ఎస్ ను స్వాగతించారు. పవన్ చేసిన తాజా వ్యాఖ్యలతో టీడీపీలో చర్చ మొదలైంది. ఏపీలో టీడీపీతో పొత్తు దాదాపు ఖాయమని భావిస్తున్న వేళ..తెలంగాణలో కొత్త పార్టీలను పొత్తులకు ఆహ్వానించేలా పవన్ వ్యాఖ్యలు చేయటం టీడీపీ నేతలకు అంతు చిక్కటం లేదు. ఏపీలో టీడీపీతో పొత్తు..తెలంగాణలొ మరో పార్టీతో పొత్తు అనే విధంగా పవన్ తీరు కనిపిస్తోందనే వ్యాఖ్యలు ఉన్నాయి. కానీ, ముందుగా తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో పొత్తుల ఎఫెక్ట్ ఏపీలోనూ ప్రభావం చూపుతుంది.

బీఆర్ఎస్ కు స్వాగతం..పొత్తుకు కూడా ఓకేనా
తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల తరహా త్యాగాలు ఉండవని పవన్ తేల్చి చెప్పారు. అదే సమయంలో బీజేపీతో కలిసి ఉన్నానని ఒక వైపు చెబుతూనే..మరో వైపు పొత్తులకు ఎవరైనా వస్తే చూద్దాం అంటూ పవన్ చేసిన వ్యాఖ్యల్లో స్పష్టత లోపింది. ఏపీ - తెలంగాణలో 2014 తరహా ఫార్ములా కొనసాగించాలనేది పవన్ అభిమతం. కానీ..టీడీపీతో కలిసి వేదిక పంచుకోవటానికి బీజేపీ సిద్దంగా లేదు. ఏపీలో తమ ఓట్ బ్యాంక్ కు నష్టం చేస్తున్న బీఆర్ఎస్ ను కట్టడి చేయటంలో భాగంగా.. తెలంగాణలో ఆ పార్టీకి మద్దతుగా నిలవాలని పవన్ ఆలోచన చేస్తున్నారా అనే మరో చర్చ మొదలైంది. అదే జరిగితే.. ఏపీలో వ్యతిరేక ప్రభావం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ నిర్ణయాలు పొత్తు ఖరారైతే టీడీపీకి మరింత నష్టంగా మారే అవకాశం ఉంటుంది. పవన్ ఇవన్నీ ఆలోచన చేసిన తరువాతనే నిర్ణయం ఉంటుందని జనసేన నేతలు చెబుతున్నా.. ఇప్పటికైతే పవన్ వ్యాఖ్యలతో డైలమా కనిపిస్తోంది.

బీజేపీ డిసైడ్ అయిపోయింది.. పవన్ మాత్రం..
అటు పవన్ తమతోనే అంటూ బీజేపీ నేతలు చెబుతున్నా..లోలోపల మాత్రం జనసేన తమతో ఉండదనే అభిప్రాయాని వచ్చారు. ఢిల్లీ నేతలు ఇదే విషయం పైన ఏపీ బీజేపీ ముఖ్యులకు స్పష్టత ఇచ్చారు. పవన్ కలిసి వచ్చినా రాకున్నా..టీడీపీతో కలిసే అవకాశం లేదని తేల్చి చెప్పారు. దీంతో..పవన్..సీపీఐ ఇప్పుడు టీడీపీతో కలిసే అవకాశం ఉంది. కానీ, పవన్ తెలంగాణలో టీడీపీతో కాకుండా మరో పార్టీతో పొత్తు దిశగా ఆలోచన చేస్తే..ఏపీలోనూ టీడీపీతో పొత్తు పైన వ్యతిరేక ప్రభావం ఖాయంగా ఉంటుంది. చంద్రబాబుతో బీజేపీ దూరంగా ఉన్నా.. కేసీఆర్ దగ్గరయ్యే అవకాశం లేదు. దీంతో..ఇప్పుడు టీడీపీ వస్తే జనసేన లేదంటే ఒంటరి పోరుకు సిద్దం కావాల్సిందే. ఎన్నికలకు వారం ముందు పొత్తుల సంగతి తేలుతుందంటూ పవన్ చేస్తున్న ప్రకటనలు జనసేన కంటే టీడీపీలో ఎక్కువ టెన్షన్ కు కారణమవుతున్నాయి.












Click it and Unblock the Notifications