తెలంగాణ ఆఫర్ రేపే!: రూ.2కే టిఫిన్, రూ.5కే భోజనం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలో రెండు రూపాయలకే అల్పాహారం, ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్నారు. సుభోజనం పేరుతో ప్రారంభమయ్యే ఈ పథకం గురువారం నుండి అమలవుతోంది. హైదరాబాదు బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ లో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు.

తెలంగాణకే వస్తామని...

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పని చేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులు... తమను తెలంగాణ సచివాలయంలోకి మార్చాలంటూ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగా ఇవాళ వారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి... తమను తెలంగాణ సచివాలయంలోకి తీసుకోవాలని కోరారు.

T Government to launch Rs.5 meal scheme

లోటుపాట్లు ఎత్తి చూపుతాం: కోదండరాం

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ తిరిగి తన ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెట్టారు. ఉస్మానియా పీజీ కాలేజీలో ప్రొఫెసర్‌గా మళ్లీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఉద్యమం కోసం నాలుగేళ్లుగా లీవ్‌లో ఉన్నానని చెప్పారు. ప్రొఫెసర్ వృత్తిలో ఉన్నప్పటికీ ప్రజలకు అందుబాటులోనే ఉంటానన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామిగానే ఉంటానని చెప్పారు. ప్రభుత్వ పనితీరును పర్యవేక్షిస్తుంటానన్నారు. ప్రభుత్వానికి సహకరిస్తూనే లోటుపాట్లను ఎత్తి చూపుతానన్నారు. ఉద్యమంలో అనుభవంలోకి వచ్చిన విషయాలను తన విద్యార్థులకు బోధిస్తానని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+