జగన్ పార్టీ అభిమాన అధికారులుంటే వెళ్లిపోవచ్చు: ఎమ్మెల్యే సంచలనం

తెలుగుదేశం పార్టీ సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై అభిమానం ఉన్న అధికారులు, సిబ్బంది మరో ప్రాంతానికి బదిలీ చేయించుకోవాలని సూచించారు.

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై అభిమానం ఉన్న అధికారులు, సిబ్బంది మరో ప్రాంతానికి బదిలీ చేయించుకోవాలని సూచించారు.

తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పే పనులతోపాటు సర్పంచ్‌లకు పనులు చేయని అధికారులు తన నియోజకవర్గం అవసరం లేదని తేల్చి చెప్పారు. స్థానిక కళ్యాణ మండపంలో ఆయన బుధవారం నియోజకవర్గ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

 talari aditya takes on at officials who supports ysrcp leaders

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలారి ఆదిత్య మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధుల తీర్మానం ఉన్నా.. లేకున్నా.. గృహ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు మెజారిటీ జన్మభూమి కమిటీ సభ్యుల ఆమోదంతో చేయాలని మండల అధికారులను ఆదేశించారు.

సర్పంచ్‌ను కారణంగా చూపించి పనులు ఆపేసే పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తమిళనాడుకు ఇసుక అక్రమ రావాణాను అడ్డుకోవాలని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+