ఏపి మీ తాతదా..మేము వస్తాం : అది నిజమైతే రాజీనామా చేస్తా : బాబు కు తలసాని సవాల్..!
ఏపి ముఖ్యమంత్రి పై సందర్భం వచ్చిన ప్రతీ సారి విమర్శలు గుప్పించే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మరోసారి చంద్రబాబు పై ఆరోపణలు సంధించారు. చంద్రబాబుది మోసం చేయాలనే వ్యక్తిత్వం అని విమర్శించారు. ఏపి చంద్రబాబు తాతదా అని నిలదీసారు. ఏపికి వచ్చి తీరుతామని స్పష్టం చేసారు.
ఏపి మీ తాతదా..వస్తాం..
ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుది మోసం చేయాలన్న వ్యక్తిత్వమని విమర్శించారు. పోలీసులు, సీఎస్‌లను చంద్రబాబు నిండా ముంచుతారన్నారని ఆరోపించారు. ఏపీ వాళ్ల ఆస్తులను లాక్కోవడానికి ట్విటర్ పిట్ట సరిపోతుందని.. మంత్రి లోకేశ్‌ను పరోక్షంగా విమర్శిం చారు. తమ రాష్ట్రానికి ఎందుకు వస్తున్నావ్ అని చంద్రబాబు అడుగుతున్నారని.. అదేమైనా మీ తాతదా.. మేము వస్తాం అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు. ఏపీలో తమకు బంధువులు ఉన్నారన్నారు.

చంద్రబాబు చేసే పనుల వల్ల ఎన్టీ ఆర్ ఆత్మక్షోభిస్తోందన్నారు. రేవంత్‌రెడ్డి కేసులో బాబు అడ్డంగా దొరికిపోయి పారిపోయారన్నారు. దొంగ చంద్రబాబుని నమ్మొద్దని.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు టీఆర్‌ఎస్ పిలుపునిస్తోందన్నారు. ప్రభుత్వంలో కొట్టేసిన డబ్బును వైట్ చేసుకోవ డానికే.. హెరిటేజ్‌లో లాభాలు వస్తున్నట్లు చూపిస్తున్నారన్నారని తలసాని ఆరోపించారు.
రాజీనామా చేస్తా..సవాల్..!
ఏపీలో జీరో పర్సంట్ అవినీతి ఉంటే తాను రాజీనామా చేస్తానన్నారు. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు ఇళ్లు అధికారికంగా రూ.2 కోట్లు అంటారని.. అనధికారికంగా అది రూ.20 కోట్లు పలుకుతుందన్నారు. ప్రపంచంలోనే అత్యంత తెలివైనవారు చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. నిన్నమొన్న పుట్టిన చంద్రబాబు మనువడికి అన్ని కోట్ల ఆస్తి ఎలా వచ్చిందంటూ తలసాని ప్రశ్నించారు. ఏపిలో ముఖ్యమంత్రి కులాల మద్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications