పండుగ వేళ IRCTC సైట్ క్రాష్, రైల్వే కీలక సూచన.. ఇలా చేయండి..!!
పండుగ వేళ ప్రయాణీకులకు రైల్వే శాఖ.. ఐఆర్సీటీసీ పరీక్ష పెడుతోంది. రైల్వే శాఖ దీపావళి, చత్త్ పండుగల కోసం దాదాపు 12 వేలకు పైగా ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఇక.. ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్న వారికీ ఇంకా వెయిటింగ్ లిస్టు క్లియర్ కాలేదు. తాత్కాల్ కోసం ప్రయత్నిస్తున్న వారి సహనాన్ని ఐఆర్సీటీసీ వెబ్ సైట్ పరీక్షిస్తోంది. ఇదే సమయంలో అధిక ధరలు ఇప్పుడు దీపావళి వేళ ప్రయాణీకులను టెన్షన్ పెడుతోంది.
దీపావళి, ఛాట్ పండుగల వేళ రైల్వే శాఖ మొత్తంగా 763 ప్రత్యేక ట్రైన్‌లు, 10,782 సర్వీసులు నిర్వహించనున్న రైల్వేలు. 17 రైల్వే జోన్లు పండుగ రవాణా కోసం 12,000 కంటే ఎక్కువ ప్రత్యేక సర్వీసులు అందిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన రైళ్లల్లో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. రేపు (శనివారం) నుంచి మూడు రోజుల వరుస సెలవులు.. పండుగ కావటంతో ఈ రోజు తత్కాల్ రిజర్వేషన్ కోసం వేల సంఖ్యలో ప్రయాణీకులు ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ఓపెన్ చేయగా షాక్ అయ్యారు. సైట్ ఓపెన్ కావటం లేదు. దీంతో, అనేక మంది తమ సమస్యను రిపోర్ట్ చేస్తున్నారు. తాజాగా తత్కాల్ తో ఆధార్ అనుసంధానం.. వేళల్లో మార్పులతో కొంత సమస్యగా మారింది. ఇదే సమయంలో పండుగ వేళ సైట్ ఓపెన్ కాకపోవటం.. రిజర్వేషన్లు దొరక్కపోవటంతో ప్రయాణీకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో రైల్వే శాఖ మరిన్ని అదనపు సర్వీసులను ప్రకటించింది. ఈనెల17, 18 తేదీల్లో వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు. అక్టోబర్ 17న హెచ్‌ఎస్. నాందేడ్-సీఎస్టీ ముంబై(07611), చర్లపల్లి-అనకాపల్లి(07097), 18న సీఎస్టీ ముంబై-కరీంనగర్ (01021), కరీంనగర్-సీఎస్టీ ముంబై, అనకాపల్లి-చర్లపల్లి(07098) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు పేర్కొన్నారు. రైళ్లు ఫుల్ అవ్వటంతో పాటుగా ప్రత్యేక బస్సుల్లోనూ అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
ప్రయివేటు బస్సుల్లో ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. విమాన టికెట్ల బుకింగ్ కూడా గత ఏడాది దీపావళితో పోలిస్తే 15-20 శాతం పెరిగిందని ట్రావెల్ ఏజెంట్లు తెలిపారు. 65-70 శాతం విహార యాత్రలకు సంబంధించినవి ఉన్నాయన్నారు. దీంతో, అదనపు రైళ్లను ఏర్పాటు చేసి ప్రయోజనం ఏంటని ప్రయాణీకులు నిలదీస్తున్నారు. దీంతో, సైట్ క్రాష్ పైన రైల్వే అధికారులు స్పందించారు. రైల్వే ప్రయాణీకులు వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన సమయంలో సాంకేతిక కారణాలతో బుకింగ్, టికెట్ల రద్దు ఫెసిలిటీ కొద్దిగంటల పాటు అందుబాటులో ఉండదని.. టీడీఆర్, టికెట్ల రద్దుకు సంబంధించిన సహాయం కోసం ప్రయాణికులు 08044647999, 08035734999 నంబర్లలో లేదంటే [email protected] కు ఇమెయిల్ పంపాలని సూచించింది.












Click it and Unblock the Notifications