వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌తో భేటీ: టెక్కీలకు టిసిఎస్ తీపి (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు ఆదిభట్లలోని టిసిఎస్ సంస్థలో త్వరలో మరో 28 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్టు ఆ సంస్థ సిఇఓ చంద్రశేఖరన్, వైస్ ప్రెసిడెంట్ వి రాజన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకు తెలిపారు. సచివాలయంలో గురువారం టిసిఎస్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతో సమావేశమయ్యారు.

ఇప్పటికే టిసిఎస్ హైదరాబాద్ యూనిట్‌లో 26 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని, త్వరలో మరో 28 వేల మంది ఉద్యోగులు కల్పిస్తామని టిసిఎఎస్ సిఇవో చంద్రశేఖరన్ ఈ సందర్భంగా చెప్పారు. టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌కు ప్రపంచంలో అనేక శాఖలు ఉన్నాయని, అందులో హైదరాబాద్ యూనిట్ ప్రపంచంలోనే 4వ అతి పెద్దదని వారు ముఖ్యమంత్రికి వివరించారు.

టిసిఎస్ సంస్థ తెలంగాణలో ఎంతో మంది యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించిందని, తెలంగాణ రాష్ట్ర పునర్ని ర్మాణంలో కూడా టిసిఎస్ సేవలు ఉపయోగించుకుంటామని సిఎం చెప్పారు. తమ రాష్ట్రంలో బిజినెస్ ఫ్రెండ్లీ, ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ విధానాలను అమలు చేస్తున్నామని, మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరారు. టిసిఎస్ విస్తరణకు అన్ని రకాలుగా తమ ప్రభుత్వం సహకరిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

ఐటి రంగం ఇటీవల ఆదిభట్ల ప్రాంతంలో బాగా విస్తరిస్తోందని, ఎనిమిది వేల మంది మహిళా ఉద్యోగులతో పాటు వేలాది మంది పని చేస్తున్నారని, వారి భద్రతకు పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా డిజిపి అనురాగ్‌శర్మను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు.

కెసిఆర్‌తో టిసిఎస్ ప్రతినిధులు

కెసిఆర్‌తో టిసిఎస్ ప్రతినిధులు

హైదరాబాదులోని శివారులోని ఆదిభట్లలో తమ సంస్థ విస్తరణపై టిసిఎస్ ప్రతినిధులు చంద్రశేఖరన్, వి. రాజన్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వివరించారు.

కెసిఆర్‌తో టిసిఎస్ ప్రతినిధులు

కెసిఆర్‌తో టిసిఎస్ ప్రతినిధులు

మరో 28 వేల మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఉద్యోగాలు కల్పిస్తామని, ఇప్పటికే 26 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని టిసిఎస్ సిఇవో చంద్రశేఖరన్ చెప్పారు.

ఈ యూనిట్ కూడా పెద్దదే

ఈ యూనిట్ కూడా పెద్దదే

టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌కు ప్రపంచంలో పలు శాఖలు ఉన్నాయని, వాటిలో హైదరాబాద్ యూనిట్ ప్రపంచంలో నాలుగవ అతి పెద్దదని టిసిఎస్ ప్రతినిధులు అన్నారు.

తెలంగాణకు టిసిఎస్ సర్వీసులు

తెలంగాణకు టిసిఎస్ సర్వీసులు

తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో టిసిఎస్ సేవలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు.

English summary
TCS CEO Chandrasekharan and vice president V Rajanna met Telangana CM K Chandrasekhar Rao said that they will hire 28 thousand techies at adibatla premises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X