టిడిపి 7 గురు ఎమ్మెల్సీలు ఖరారు : అశోక్‌బాబు కు చోటు : అన్నీ స్థానాలు ఏకగ్రీవమే..!
నామినేషన్లు సమయం ముగుస్తున్న వేళ..టిడిపి అధినేత అర్ద్రరాత్రి ఎమ్మెల్సీ అభ్యర్దులను ఖరారు చేసారు. మొత్తం ఏడుగురు అభ్యర్దులను ప్రకటించారు. అందులో నాలుగు స్థానాలు బిసిలకు..రెండు ఓసిలకు..ఒకటి ఎస్సీలకు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీరు ఈ రోజు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
ఎమ్మెల్యే కోటాలో నలుగురికి..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు మొత్తం అయిదు ఖాళీలు ప్రకటించగా..అందులో టిడిపికి నాలుగు స్థానాలు..వైసిపికి ఒక్క స్థానం దక్కుతుంది. అందులో భాగంగా వైసిపి ఇప్పటికే తమకు దక్కు ఒక్క స్థానం బిసి సామాజిక వర్గానికి చెంది న జంగా కృష్ణమూర్తికి కేటాయించారు. ఆయన ఇప్పటికే నామినేషనల్ సైతం దాఖలు చేసారు. ఇక, టిడిపి నుండి అ భ్యర్ధులను సీఎం చంద్రబాబు అర్ధరాత్రి ఖరారు చేశారు.
ఎమ్మెల్యే కోటాలో టీడీపీకి లభించే నాలుగు స్థానాలకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఏపీఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు పి.అశోక్‌బాబు, ఉత్తరాంధ్ర రజక సంఘం నేత దువ్వారు రామారావు, కర్నూలుకు చెందిన వాల్మీకి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బీటీ నాయుడును ఎంపిక చేశా రు. ఉద్యోగ సంఘ నేత అశోక్‌బాబును రాజకీయాల్లోకి ఆహ్వానించిన చంద్రబాబు..ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తున్నట్లుగా గతంలోనే హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా ఆయనకు ఎమ్మెల్యే కోటాలో అవకాశం కల్పించారు.

గవర్నర్ కోటాలో ఇద్దరు..
గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాల్లో ఒకదానిని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్న కుమారుడు శివనాథరెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే కోటాలో సిటింగ్ ఎమ్మెల్సీ శమంతకమణికి మరోసారి అవకాశమిచ్చారు. ఇక మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మరణంతో ఖాళీ అయిన విశాఖ స్థానిక సంస్థల నియోజకవర్గానికి బుద్ధా నాగజగదీశ్వరరావును ఎంపిక చేశారు. మొత్తం ఏడు స్థానాల్లో బీసీలకు నాలుగు (యనమల, దువ్వారు, బీటీ నాయుడు, నాగజగదీశ్వరరావు), రెండు అగ్రవర్ణాలకు (శివనాథరెడ్డి-రెడ్డి, అశోక్‌బాబు-కాపు), ఒకటి ఎస్సీలకు కేటాయించారు. అయితే, నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు నారాయణ ఎమ్మెల్సీ పదవి కాలం ఈ నెలాఖరుకు ముగియనుంది. అదే విధంగా మరో మంత్రి సోమిరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసారు. అయితే, నెల్లూరు మేయర్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని సీయం హామీ ఇచ్చారు. కానీ, ఈ లిస్టులో ఆయనకు అవకాశం ఇవ్వలేదు. దీని పై ఎటువంటి స్పందన వ్యక్తం అవుతుందో చూడాలి. అదే విధంగా..వర్ల రామయ్య, జూపూడి ప్రభాకర్ వంటి వారు సైతం ఎమ్మెల్సీ సీట్లు ఆశించారు.












Click it and Unblock the Notifications