చంద్రబాబు విడుదల ఎప్పుడు - టీడీపీ నేతల ప్రార్ధనలు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు కోసం పార్టీ నేతలు ప్రార్ధనలు చేస్తున్నారు. స్కిల్ స్కాంలో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది. ఈ నెల 10న విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నారు. ఈ నెల 22వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ సమయంలో కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటీషన్ పెండింగ్ లో ఉంది. కోర్టులో సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటీషన్ పైన రేపు తీర్పు రానుంది.

చంద్రబాబు కు ఈ నెల 22తో రిమాండ్ పూర్తి కానుంది. ఇక, చంద్రబాబు బయటకు వస్తారా.. ఏం జరుగుతోందనే ఉత్కంఠ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్లు కోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయి. క్వాష్ పిటీషన్ పైన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఏసీబీ కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ విచారణ జరగాల్సి ఉంది. సీఐడీ వేసిన కస్టడీ పిటీషన్ పైన గురువారం కోర్టు నిర్ణయం వెల్లడించనుంది. ఈ సమయంలోనే టీడీపీ నేతలు చంద్రబాబు విడుదల కోసం వేచి చూస్తున్నారు. టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదని..త్వరలోనే చంద్రబాబు బయటకు వస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

TDP Cadre offeres special prayers for Chandra Babu Release, protests against AP Govt

ఇటు పలువురు నేతలు సర్వమత ప్రార్ధనలు చేస్తున్నారు. విజయవాడలో కేశినేని చిన్ని, ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జ్ బుద్ధా వెంకన్న పార్టీ నేతలతో కలిసి ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం రాజకీయ కక్ష్యతో చంద్రబాబు పైన కేసు బనాయించి అరెస్ట్ చేసిందంటూ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు నిరసనలకు దిగారు. విజయవాడలో పార్టీ నేతలు చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని,త్వరగా ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాలని సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. ప్రభుత్వం చంద్రబాబు పై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని చిన్ని ఆరోపించారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు వీగిపోయి,కడిగిన ముత్యంలా బయటికి వస్తారనని ఆశాభావం వ్యక్తం చేసారు.

చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అటు లోక్ సభలో పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసారు. రాజ్యసభలో చంద్రబాబు అరెస్ట్ వెనుక ఆధారాలు..సాక్ష్యాలతోనే అరెస్ట్ చేసామని వైసీపీ నేత విజయ సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చంద్రబాబు కేసుల అంశాలను ప్రజల ముందు ఉంచేందుకు సిద్దం అవుతోంది. అటు టీడీపీ ఎమ్మెల్యేలు సభలోనే చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసనలకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు చంద్రబాబు రిమాండ్ పూర్తవుతున్న వేళ..న్యాయ పరంగా కోర్టులు ఎటువంటి నిర్ణయాలు ప్రకటిస్తాయనే ఉత్కంఠ పార్టీలో కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+