విజయవాడకు చంద్రబాబు తరలింపు - తప్పు చేస్తే ఉరేయండి..!!
నంద్యాలలో అరెస్ట్ చేసిన చంద్రబాబును విజయవాడ తరలిస్తున్నారు. అర్దరాత్రి నుంచి నంద్యాలలో చంద్రబాబు బస చేసిన క్యాంపు వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఈ ఉదయం పోలీసు ఉన్నతాధికారులు చంద్రబాబుకు నోటీసు ఇచ్చారు. ఆ సమయంలో వాగ్వాదం జరిగింది. వైద్య పరీక్షల అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడకు తరలిస్తున్నారు. అటు మాజీ మంత్రి గంటా అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ పైన చంద్రబాబు సీరియస్ గా స్పందించారు.
ఏపీ సీఐడి అధికారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్ చేసారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో నంద్యాలలో ఉన్న చంద్రబాబును అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు. రోడ్డు మార్గంలో నంద్యాల, గిద్దలూరు,మార్కాపురం,త్రిపురాంతకం,వినుకొండ,నర్సరావుపేట, గుంటూరు మీదుగా విజయవాడ తీసుకుని వస్తున్నట్లు తెలుస్తోది.

కాసేపట్లో సీఐడీ డీజీ మీడియా సమావేశం ద్వారా చంద్రబాబు, గంటా అరెస్ట్ కు సంబంధించిన అంశాలను అధికారికంగా వెల్లడించనున్నారు. అటు మాజీ మంత్రి గంటా తో పాటుగా ఆయన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేసారు. అసలు ప్రమేయం లేని కేసులో తమను అరెస్ట్ చేయటం రాజకీయ కుట్రగా గంటా ఆరోపించారు.
చంద్రబాబు పైన పలు సెక్షన్లను నమోదు చేసారు.- సెక్షన్ 166,167,120(B), 418, 420, 465, 466, 471, 201,109, 409, 109 R/W 34&37 IPC, 25 12, 13(2), R/W 13(1)(c)(D) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1998 కింద కేసు నమోదు అయింది. నాన్‍బెయిలబుల్ వారెంట్‍పై కెసులు నమోదు చేసిననట్లు నోటీసులో పేర్కొన్నారు.

ఏ కేసులో ఏ నేరంలో తన వద్దకు వచ్చారు అని చంద్రబాబు ప్రశ్నించారు. తన హక్కులు ఉల్లంఘిస్తున్నారని.. తాను తప్పు చేస్తే నడిరోడ్డులో ఉరేయండని తెలిపారు. అసలు ఏ చట్ట ప్రకారం తనను అరెస్ట్ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత అయిన తనకు ఇచ్చే గౌరవం ఇదేనా అని చంద్రబాబు నిలదీసారు.
తప్పు లేకుండా ఒక్క మంచి మనిషిని అరెస్ట్ చేసావు @ysjagan. దేవుడే నీకు బుద్ధి చెపుతారు #WeWillStandWithCBNSir#G20India2023#StopIllegalArrestOfCBN#PsychoJagan pic.twitter.com/DlzNMK4JIH
— Telugu Desam Party (@JaiTDP) September 9, 2023
ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారో సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. కనీసం ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని చంద్రబాబు . అరెస్ట్ చేసేటప్పుడు తనకు ప్రాథమిక ఆధారాలు ఇవ్వాలి కదా అని పోలీసు అధికారులను నిలదీసారు. . 24 గంటలలో అన్ని ఇస్తామని పోలీసులు చెప్పారు.
ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై హత్యచేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అడ్డుకుంటున్నారు. నేను తప్పు చేస్తే నిరూపించాలి. చివరకు ధర్మమే గెలుస్తుంది. ప్రజలు, టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలి - టీడీపీ అధినేత చంద్రబాబు #WeWillStandWithCBNSir#G20India2023#StopIllegalArrestOfCBN… pic.twitter.com/q2dTW34GwE
— Telugu Desam Party (@JaiTDP) September 9, 2023
ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని న్యాయవాదులు కోరారు. ఈ సమయంలో రావాల్సిన అవసరం ఏముందని చంద్రబాబు ప్రశ్నించారు. కోర్టులో ఏముందో చెప్పాలని చంద్రబాబు కోరారు. చంద్రబాబు ను విజయవాడకు తీసుకొచ్చిన వెంటనే బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించేందుకు న్యాయవాదులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications