నెల్లూరులో వైసీపీకి గుడ్ న్యూస్..! గత ఎన్నికల తర్వాత ఇదే..!
ఒకప్పుడు ఏపీ రాజకీయాల్లో వైసీపీ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన జిల్లాల్లో ఒకటైన నెల్లూరులో గత ఎన్నికల తర్వాత పరిణామాలు చాలా మారిపోయాయి. అంతే కాదు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మేయర్ సీటు కూడా దూరమైంది. దీంతో ఇక జిల్లాలో వైసీపీ పనైపోయిందని అంతా అనుకుంటున్న తరుణంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. దీంతో నెల్లూరు నగరంలో వైసీపీకి మళ్లీ ఊపిరివచ్చినట్లయింది.
నెల్లూరు సిటీతో పాటు రూరల్ నియోజకవర్గాలకు చెందిన పలువురు అధికార టీడీపీ కార్పోరేటర్లు ఇవాళ ఆ పార్టీని వీడారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు. దీంతో జగన్ కూడా వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకోవాలని వారికి సూచించారు.

ఇవాళ వైసీపీలో చేరిన నెల్లూరు టీడీపీ కార్పోరేటర్లలో మద్దినేని మస్తానమ్మ (నెల్లూరు సిటీ 6వ డివిజన్ కార్పొరేటర్), ఓబుల రవిచంద్ర (నెల్లూరు సిటీ 5వ డివిజన్ కార్పొరేటర్), కాయల సాహితి (నెల్లూరు సిటీ 51వ డివిజన్ కార్పొరేటర్), వేనాటి శ్రీకాంత్ రెడ్డి (నెల్లూరు సిటీ 16వ డివిజన్ కార్పొరేటర్), షేక్ ఫమిదా (నెల్లూరు రూరల్ 34వ డివిజన్ కార్పొరేటర్) ఉన్నారు. వీరంతా టీడీపీపై కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ మాజీ మంత్రి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వీరితో మాట్లాడి పార్టీలోకి రప్పించారు.
-
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications