తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు, కొట్టుకున్నారు (పిక్చర్స్)
గుంటూరు: గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు సోమవారం వీరంగం సృష్టించారు. గుమ్మడి రమేష్, పసుపులేటి త్రిమూర్తులు కౌన్సిల్ సమావేశం సాక్షిగా కొట్టుకున్నారు, పరస్పరం తోసేసుకున్నారు. ఈ ఘర్షణలో ఓ కౌన్సిలర్ చొక్కా పూర్తిగా చినిగిపోయింది.
మిగతా కౌన్సిలర్లు అపడానికి ప్రయత్నించినా వారు పరస్పరం పిడిగుద్దులు గుప్పించుకున్నారు. పరస్పరం అసభ్య పదజాలం వాడుకుంటూ కలబడ్డారు. మినిట్స్ బుక్కు ఎంట్రీలకు సంబంధించిన విషయంపై ఇరువిర మధ్య తొలుత వాగ్వివాదం చోటు చేసుకుంది. వాగ్వివాదం కాస్తా ముష్టి యుద్ధానికి దారి తీసింది.
వారిద్దరికి మధ్య వ్యక్తిగతమైన విభేదాలున్నాయని, పలుమార్లు సమావేశంలో వాగ్వివాదానికి దిగారని అంటున్నారు. గతంలో వారిద్దరినీ స్థానిక శాసనసభ్యుడు హెచ్చరించారని కూడా చెబుతున్నారు. ఒక్క పార్టీకి సంబంధించినవాళ్లు ఓ పద్ధతిగా ఉండాలని ఎమ్మెల్యే చెప్పారని అంటున్నారు.
అయినా, వారు తమ పద్ధతి మార్చుకోలేదని, సోమవారంనాటి సమావేశంలో వారి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుందని చెబుతున్నారు. మినిట్స్ బుక్కులో స్టాండింగ్ కమిటీ విషయాలను పొందుపరచాలని ఒక వర్గం వాదించగా, మరో వర్గం అవసరం లేదని వాదించడం వద్ద ఇరువురి మధ్య గొడవ ప్రారంభమైందని చెబుతున్నారు.

తన్నుకున్నారు..
తెలుగు తమ్ముళ్లు కౌన్సిల్ సాక్షిగా తన్నుకుని పార్టీ పరువును బజారుకీడ్చారు. గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కౌన్సిల్‌లో సోమవారం ఈ సంఘటన జరిగింది. తెలుగుదేశం కౌన్సిలర్లు ముష్టియుద్ధానికి దిగారు.

ఇలా ప్రారంభం..
కౌన్సిల్‌లో ఆమోదించిన అంశాలను మినిట్స్ బుక్‌లో నమోదు చేయాలని గుమ్మడి రమేశ్ సూచించారు. సమయాభావం వల్ల తర్వాత నమోదు చేస్తామని కమిషనర్ కె.శకుంతల చెప్పారు.

నిబంధనల ప్రకారం...
నిబంధనల ప్రకారం సమావేశంలోనే మినిట్స్ నమోదు చేయాలని, ఆతర్వాత రాస్తే పేర్లు, నిర్ణయాలు మారిపోయే అవకాశం ఉందని రమేశ్ అన్నారు.

సంప్రదాయం లేదు..
పెండేల సుబ్బారావు జోక్యం చేసుకుని.. గతంలో ఈ సంప్రదాయం లేదని, ఇప్పుడు రాయాల్సిన అవసరం లేదన్నారు.

ఆ సమయంలో..
ఈ తరుణంలో మరో సభ్యుడు పసుపులేటి త్రిమూర్తి కలుగజేసుకుని.. ఇప్పుడే ఎందుకు రాయాలని ప్రశ్నించడం వివాదానికి దారితీసింది. రమేశ్, త్రిమూర్తులు అఇద్దరూ కలబడి కొట్టుకున్నారు.

చొక్కా చినిగింది..
వారిద్దరి పిడిగుద్దులతో కౌన్సిల్ దద్దరిల్లింది. త్రిమూర్తి చొక్కా చినిగిపోయింది. పెనుగులాటలో ఇద్దరూ కిందపడ్డారు. మిగతా కౌన్సిలర్లు అడ్డుకోవడానికి ప్రయత్నించినా వారు ఆగలేదు.












Click it and Unblock the Notifications