టిట్లీ తుఫాను సాయం, చంద్రబాబు ప్రచారంపై పవన్ కళ్యాణ్ బస్సు ఫోటో
అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వం టిట్లీ తుఫాను బాధితులకు ఎంతో సాయం చేసినట్లుగా ప్రచారం చేసుకుంటోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం తన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. బస్సు పైన ప్రభుత్వం చేసుకున్న ప్రచారానికి సంబంధించిన ఫోటోను పెట్టి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
శ్రీకాకుళం జిల్లాలోని తుఫాను బాధితులకు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సాయం పిసరంత అనీ కానీ ప్రచారం మాత్రం కొండంత అని పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ప్రచారం ఎంత చేసుకుంటే ఏమిటని, చేసింది మాత్రం ఏదీ లేదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తనకు అబ్రహం లింకన్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయని చెబుతూ.. టిట్లీ తుఫాను బాధితులకు ఏపీ ప్రభుత్వం కొండంత అండ అంటూ బస్సు పైన పోస్టర్లతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు.
TDP Govt,help for Titli victims is peanuts,but publicity !! .. the size of an Everest!!!
— Pawan Kalyan (@PawanKalyan) November 12, 2018
This reminds me of a quote of Abraham Lincoln :” What kills a skunk is the publicity it gives itself”. pic.twitter.com/PJ6HYwz8xk

శ్రీకాకుళంలోని టిట్లీ బాధితుల అసలు పరిస్థితి ఇది అంటూ పవన్ కళ్యాణ్ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేశారు. టిట్లీ జాబితాలు పూర్తిగా సిద్ధం కాలేదని, కరువు మండలాల్లో ఇన్‌ఫుట్ పైన తేల్చలేదని, భారీ వర్ష బాధితుల ఊసే లేదని, నిధుల విడుదలలోను కొంచెం.. కొంచెం ఇచ్చారని, అంతా ఇచ్చేసినట్లుగా చెబుతున్నారని ఆ కథనంలో ఉంది.
Titli victims real situation: pic.twitter.com/so2jXpF3bl
— Pawan Kalyan (@PawanKalyan) November 12, 2018
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications