జీవీ రెడ్డి రీ ఎంట్రీ- బిగ్ ఆఫర్..!?

టీడీపీలో జీవీ రెడ్డి ఎపిసోడ్ వివాదంగా మారింది. జీవీ రెడ్డి రాజీనామాతో పార్టీ కేడర్ అంతా ఒక్కటి అయింది. టీడీపీ నాయకత్వాన్ని నిలదీసింది. సోషల్ మీడియాలో వేలాది పోస్టింగ్స్ జీవీ రెడ్డికి మద్దతుగా వచ్చాయి. పార్టీ ఇలాంటి వారిని వదులుకోవద్దంటూ కేడర్ నినదించింది. చంద్రబాబు, లోకేష్ తమ వైఖరి మార్చుకోవాలని సూచనలు చేసారు. జీవీ రెడ్డి విషయంలో పునరాలోచన చేయా లని డిమాండ్ చేసారు. ఈ సమయంలో జీవీ రెడ్డి పైన టీడీపీ నాయకత్వం కొత్త ఆలోచన చేస్తున్న ట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. మరో ముఖ్య పదవి ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

జీవీ రెడ్డి రాజీనామాతో
కూటమి ప్రభుత్వం లో ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి తాజాగా తన పదవితో పాటుగా టీడీపీకి రాజీ నామా చేసారు. ఫైబర్ నెట్ లో చోటు చేసుకున్న పరిణామాలు.. అక్కడ ఐఏఎస్ అధికారి తన నిర్ణయాలను అమలు చేయకపోవటం పైన జీవీ రెడ్డి మీడియా సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యవహారాన్ని పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకుంది. అంతర్గతంగా చర్చించాల్సిన అంశా లను ప్రభుత్వానికి డామేజ్ చేసే విధంగా ఓపెన్ గా మాట్లాడటం పైన మందలించినట్లు సమా చారం. దీంతో, జీవీ రెడ్డి తన పదవితో పాటుగా పార్టీకి రాజీనామా చేసారు. తాను భవిష్యత్ లో ఒక ఏ పార్టీలో చేరనని జీవీ రెడ్డి స్పష్టం చేసారు.

TDP high command changed decision over GV Reddy as Reports details here

కేడర్ మద్దతు
జీవీ రెడ్డి రాజీనామా పైన టీడీపీ కేడర్ స్పందించింది. జీవీ రెడ్డి రాజీనామాకు ఆమోదించటం పైన కేడర్ ముక్తకంఠం తో ఖండించింది. చంద్రబాబు, లోకేష్ ను పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేది కగా ప్రశ్నించారు. పార్టీ కోసం పని చేసే నేతలు, కేడర్ కంటే అధికారులకే ప్రాధాన్యత ఇస్తారా అంటూ నిలదీసారు. ఆత్మగౌరవం కోసమే జీవీ రెడ్డి రాజీనామా చేసారంటూ.. ఆయనకు మద్దతుగా నిలిచారు. జీవీ రెడ్డిని వెంటనే పార్టీలోకి తీసుకోవాలన్న డిమాండ్ చేసారు. అధికారంలో లేనప్పుడే పార్టీ కోసం పోరాడిన వ్యక్తి.. ఇప్పుడు రాజీనామా చేయడంపై టీడీపీ పెద్దలే సమీక్ష చేసుకోవాలని చురకలు అంటించారు.

తాజా ఆఫర్
గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ నాయకత్వం పైన కేడర్ ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయ టంతో ఇప్పుడు పార్టీ పునరాలోచనలో పడినట్లు సమాచారం. కేడర్ ఆగ్రహాన్ని తగ్గించేందుకు పార్టీ ముఖ్యులు ఇప్పటికే జీవీ రెడ్డితో టచ్ లోకి వెళ్లినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. తిరిగి పార్టీ లో యాక్టివ్ కావాలని కోరుతున్నారు. పార్టీ కేడర్ ఈ స్థాయిలో మద్దతుగా నిలుస్తున్న జీవీ రెడ్డికి కీలక పదవి ఇవ్వాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. జీవీ రెడ్డి తిరిగి పార్టీలో యాక్టివ్ అయితే.. ఆయనకు ఎమ్మెల్సీ గా అవకాశం ఇస్తారని ముఖ్య నేతల్లో చర్చ జరుగుతోంది. ఫైబర్ నెట్ పదవి మరో యువ నేతకు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో, ఇప్పుడు జీవీ రెడ్డి పార్టీ నేతల ప్రతిపాదన పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు... జీవీ రెడ్డి ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+