వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

TDPపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించిన జనసేన?

|
Google Oneindia TeluguNews

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకోవడం ఖాయమని ఇరుపార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు నమ్మకంతో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసి అరగంట చర్చలు జరిపిన తర్వాత కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ ప్రకటించడంద్వారా పొత్తులకు ద్వారాలు మూయలేదని, కలిసే ముందుకు వెళ్లాలనే నిర్ణయానికి కట్టుబడివున్నట్లుగా స్పష్టమవుతోంది.

పొత్తు బీజేపీతో.. కార్యక్రమాలు టీడీపీతో..

పొత్తు బీజేపీతో.. కార్యక్రమాలు టీడీపీతో..

పొత్తుపై అధికారికంగా ప్రకటన రావడమే తరువాయి అన్నట్లు ఇరు పార్టీల శ్రేణులు కలిసికట్టుగా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నాయి. అధికారికంగా బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన అధికారికంగా టీడీపీతో కలిసి కార్యక్రమాలు చేపడుతోంది. విజయవాడలో బీజేపీ-జనసేన సమావేశం జరుగుతుందని బీజేపీ నాయకులు మీడియాకు లీకులివ్వగా వాటిని జనసేన ఖండించింది. దీనిద్వారా ఆ పార్టీ బీజేపీతో కలిసి వెళ్లడానికి ఇష్టపడటంలేదని అర్థమవుతోంది. పొత్తు కుదిరితే జనసేనకు ఎన్ని స్థానాలిస్తారు? అనే చర్చ టీడీపీ, జనసేనలో జరుగుతోంది.

స్పష్టత ఇవ్వాలంటున్న టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జిలు..

స్పష్టత ఇవ్వాలంటున్న టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జిలు..


తెలుగుదేశం పార్టీ తరఫున నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జిలుగా పనిచేసుకుంటున్నవారు కూడా డబ్బులు ఖర్చుపెట్టే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. ఇప్పుడు తాము ఇంత కష్టపడి పనిచేసుకుంటుంటే తర్వాత నియోజకవర్గం జనసేనకు కేటాయిస్త తమ శ్రమ, తమ డబ్బులు బూడిదలో పోసినట్లవుతాయనే ఉద్దేశంతో చురుగ్గా కార్యక్రమాలు కూడా చేపట్టడంలేదు. పొత్తులంటాయనే విషయాన్ని అధికారికంగా ప్రకటించి, ఏయే నియోజకవర్గాలు జనసేనకు కేటాయిస్తారో టీడీపీ అధినేత చంద్రబాబు ఒక స్పష్టత ఇస్తేనే నాయకులంతా ముందుకు కదిలేటట్లుగా ఉన్నారు.

40 అడగాలనుకుంటున్న జనసేన?

40 అడగాలనుకుంటున్న జనసేన?


జనసేన 40 నియోజకవర్గాల వరకు డిమాండ్ చేస్తుందని, అలా గట్టిగా డిమాండ్ చేస్తే 30 నియోజకవర్గాలు కేటాయించే అవకాశం ఉందని జనసేనవర్గాలు చెబుతున్నాయి. అలా కాకుండా తెలుగుదేశం పార్టీ 25 నియోజకవర్గాలనే కేటాయిస్తే ఒత్తిడి తీసుకురావాలనే యోచనలో జనసేన నేతలున్నట్లు తెలుస్తోంది. కనీసం 40 నియోజకవర్గాలు కేటాయిస్తే అందులో కచ్చితంగా 30 నియోజకవర్గాల్లో జనసేన విజయబావుటా ఎగరవేయాలనే పట్టుదలతో పవన్ కల్యాణ్ ఉన్నారు. వీటన్నింటిమీద పూర్తిస్థాయిలో స్పష్టత రావాలంటే రెండు పార్టీల నుంచి అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాతే. అప్పటివరకు ఊహాగానాలు రాజ్యమేలుతుంటాయి.

English summary
Leaders and activists of both the parties are confident that Telugu Desam Party and Jana Sena will form an alliance in the next elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X