Ruler: బాలా మావయ్యా! మీ డైలాగ్ సూపర్.. టోటల్ గా మీ 'రూలర్' సినిమా..: నారా లోకేష్

అమరావతి: యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన తాజా సినిమా రూలర్. వేదిక, సోనల్ చౌహాన్ కథానాయికలు. సీకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సీ కల్యాణ్ ఈ సినిమాను నిర్మించారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన రూలర్.. ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని చిత్రం యూనిట్ ప్రీ రిలీజ్ఈవెంట్ ను సైతం నిర్వహించింది. ఈ సందర్భంగానే మూవీ ట్రైలర్ ను విడుదల చేసింది.

ఈ ధాన్యం తింటున్న మీకే అంత పొగరు ఉంటే...

ఈ ధాన్యం తింటున్న మీకే అంత పొగరు ఉంటే...

ఈ ట్రైలర్ నందమూరి అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. బాలకృష్ణ తన మార్క్ మేనరిజంతో పలికిన డైలాగులు సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేశాయి. `ఈ ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరు చూపిస్తుంటే, దీన్ని పండించిన రైతుకు ఇంకెంత పవరు, పొగరు ఉంటుందో చూపించమంటావా?..` అనే పవర్ ఫుల్ డైలాగ్ అంతే పవర్ ఫుల్ గా పలికిన విధానం బాలకృష్ణ ఫ్యాన్స్ ను కట్టి పడేస్తోంది.

 బాలా మావయ్యా.. మీ డైలాగ్ సూపర్

బాలా మావయ్యా.. మీ డైలాగ్ సూపర్

ఈ డైలాగ్ బాలకృష్ణ అభిమానులనే కాదు.. ఆయన అల్లుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ ను సైతం విపరీతంగా ఆకట్టుకుంది. ఈ డైలాగ్ అద్భుతంగా ఉందని బాలకృష్ణపై ప్రశంసలను కురిపించారు. తాను ఆదివారం ఉదయమే ట్రైలర్ ను చూశానని చెప్పుకొచ్చారు. ఒకే ఒక్క డైలాగ్ లో రైతుల గొప్పదనం గురించి.. బాలకృష్ణ అద్భుతంగా వర్ణించారని అన్నారు. ఆ డైలాగ్ ను పొందుపరుస్తూ ఓ ట్వీట్ చేశారు.

 దుమ్ములేపుద్దనిపిస్తోందట..

దుమ్ములేపుద్దనిపిస్తోందట..

బాలకృష్ణ డైలాగ్ పలికిన విధానం సూపర్ గా ఉందని, రూలర్ సినిమా ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఈ ఒక్క డైలాగ్ ను బట్టి సినిమా ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో అర్థమౌతోందని అన్నారు. సినిమా దుమ్ములేపుద్దనిపిస్తోందని చెప్పారు. ఆల్ ద బెస్ట్ బాలా మావయ్య అని తన ట్వీట్ ను ముగించారు. ఈ నెల 20వ తేదీన విడుదల కాబోయే ఈ సినిమా బాలకృష్ణకు మంచి పేరును తీసుకుని రావాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు నారా లోకేష్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+