లేడీ కానిస్టేబుల్‌కు క్లాస్ పీకిన అనిత.. ఇంటికి ఎందుకు వచ్చావంటూ ఫైర్ (వీడియో)
మాజీమంత్రి అయ్యన్నపాతుడు ఇంటి ప్రహరీ గోడ కూల్చివేతను నిరసిస్తూ టీడీపీ నేతలు నిరసనకు దిగారు. ఇవాళ ఛలో నర్సీపట్నం పిలుపునిచ్చింది. దీంతో టీడీపీ నేతలు బయల్దేరుతుండగా.. ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. అలాగే తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఇంటికి లేడీ కానిస్టేబుల్ చేరుకున్నారు. తన వద్దకు వచ్చిన ఆ ఖాకీపై అనిత ఫైరయ్యారు. తనదైనశైలిలో ప్రశ్నలు వేసి కానిస్టేబుల్‌కు చుక్కలు చూపించారు. ఆ వీడియోను అనిత పంచుకున్నారు.

కానిస్టేబుల్‌ను భయపెట్టిన అనిత
వంగలపూడి అనితను గృహనిర్బంధం చేసేందుకు ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్ ఆమె ఇంటికి వెళ్లారు. వెళ్లడమే పాపమైపోయింది. ఆమెపై అనిత మండిపడ్డారు. ఆ మహిళా పోలీసు నోటీసులు లేకుండా రావడంతో క్లాస్ తీసుకున్నారు. కానిస్టేబుల్‌ను నిల్చొబెట్టి మరీ క్లాస్ పీకారు. ఆ మహిళా పోలీసుకు నేమ్ ప్లేట్ కూడా లేదు. దీంతో అనితకు మరింత కోపం వచ్చింది. నేమ్ ప్లేట్ కూడా లేకుండా రావడం ఏంటీ అని ఫైరయ్యారు.

ప్లీజ్.. నోటీసులు ఉంటేనే రండి
41ఏ నోటీసులు ఉంటేనే తన ఇంటికి రావాలని అనిత స్పష్టంచేశారు. అప్పుడు గృహనిర్బంధం చేస్తే తనకే ఇబ్బంది లేదని కరాఖండీగా చెప్పారు. నిబంధనలు పాటించకుండా వచ్చి గృహనిర్బంధం అంటే కోర్టులో కేసు వేస్తానని హెచ్చరించారు. అప్పటికప్పుడు ఆ మహిళా పోలీసుతో సీఐకి ఫోన్ చేయించి ఇదే విషయాన్ని ఆ అధికారికి కూడా స్పష్టం చేశారు. దీనిపై అనిత ట్విట్టర్ లో స్పందించారు. పోలీసులపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు.
రూల్స్ బ్రేక్ చేయొద్దు
నిబంధనలు పాటించకుండా వచ్చి గృహనిర్బంధం అనే పోలీసులను నిలదీయాలని అనిత కోరారు. రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఎవరైనా సరే రూల్స్ బ్రేక్ చేయొద్దు అని స్పష్టంచేశారు. పోలీసులు కూడా చట్టానికి అతీతులు కారని పేర్కొన్నారు. నోటీసు చేసి రావాలని సూచించారు. ఏదో కారణం చూపి.. హౌస్ అరెస్ట్ చేయడం ఏంటీ అని అడుగుతున్నారు. ఇదీ మంచి పద్దతి కాదని సూచించారు. తీరు మార్చుకోవాలని పోలీసులకు సూచించారు.

కానిస్టేబుల్ అవసరం లేదే
అనిత మాట్లాడుతున్నంత సేపు.. ఆ కానిస్టేబుల్ మిన్నకుండిపోయారు. ఏమీ సమాధానం చెప్పలేదు. అధికారులకు ఫోన్ చేయాలని కోరగా.. వెంటనే కాల్ చేశారు. తర్వాత సీఐ ఫోన్ మాట్లాడారు. తన ఇంటిముందు కానిస్టేబుల్ ఎందుకు అని అనిత సూటిగా ప్రశ్నించారు. వద్దు అని చెప్పడంతో ఆ కాల్ కట్ అవుతుంది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications