పంచలూడదీసి కొడతాం.. టీడీపీ అడ్డగా గుడివాడ గడ్డ..? కొడాలి నానిపై దివ్యవాణి ఫైర్
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వర్సెస్ టీడీపీ నేత, సినీ నటి దివ్యవాణి మధ్య మాటల యుద్దం జరుగుతూనే ఉంది. వివిధ అంశాలపై ఇద్దరీ మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది. తాజాగా దివ్యవాణి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కొడాలి నాని లక్ష్యంగా కామెంట్లు చేశారు. బూతుల మంత్రి అంటూ తిట్టి పోశారు. మాటలు కాదు.. పని చేసి చూపించాలని సవాల్ విసిరారు

గుడివాడ అంటే..
ఒకప్పుడు గుడివాడ అంటే దివంగత ఎన్టీఆర్ గుర్తుకు వచ్చేవారని దివ్యవాణి అన్నారు. ఇప్పుడు గుడివాడను క్యాసినోవాడగా కొడాలి నాని మార్చాడని ఆమె విమర్శించారు. కొడాలి నాని నోరు విప్పితే బూతులు తప్ప మరేమీ రావని అన్నారు. ఇదీ అందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు. రాజకీయాల కోసం, పదవుల కోసం బూతులు మాట్లాడితే... పంచలు ఊడదీసి కొడతామని ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.

క్యాసినో నాని..
కొడాలి నానిని క్యాసినో నాని అంటూ సంభోదించారు. ముందు గుడివాడలో రోడ్లు వేసి చూపించాలని ఆమె సవాల్ విసిరారు. గుడివాడ గడ్డను టీడీపీ అడ్డాగా మారుస్తామని స్పష్టంచేశారు. నాని అంటే ఏంటో గుడివాడ ప్రజలకు తెలిసిందని కామంట్ చేశారు. మరోసారి అవకాశం ఇవ్వరు.. ఇవ్వబోరని చెప్పారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అభివృద్ధి జరిగిందని కామెంట్ చేశారు. తిరిగి తామే డెవలప్ చేస్తామని ఆమె చెప్పారు.

నాని వర్సెస్ వాణి
ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో కొడాలి నానికి మంత్రి పదవీ వరించలేదు. దీంతో ఆయన కొన్నాళ్లుగా సైలంట్‌గా ఉన్నారు. తర్వాత సీఎం జగన్‌ను కలిసిన తర్వాతే.. స్వరం పెంచారు. పార్టీ కోసం పనిచేస్తానని.. తిరిగి అధికారం చేపట్టడమే టార్గెట్ అన్నారు. కానీ ఇంతలో దివ్యవాణి ఘాటు కామెంట్స్ చేశారు. కొడాలి నాని క్యాసినో నాని అంటూ విరుచుకుపడ్డారు. వాస్తవానికి ఏపీలో ఇప్పుడు పరిస్థితి అంతా బాగోలేదు. కరెంట్ కోతలతో జనం అల్లాడుతున్నారు. పవర్ ఏ సమయంలో ఉంటుందో తెలియని పరిస్థితి. ప్రజలకు చిరాకు రావడంతో.. నేతలు పోలీసు భద్రత నడుమ పర్యటిస్తున్నారు. ఇటీవల పరిశ్రమలకు పవర్ హాలీడే కూడా తీసివేశారు












Click it and Unblock the Notifications