గిన్నీస్ రికార్డు సాధించిన టీడీపీ సీనియర్ నేత మనవడు..!
విశాఖపట్నం జిల్లా భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మనవడు గంటా జిష్ణు ఆర్యన్ అద్బుతమైన ప్రతిభతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కేవలం 8 ఏళ్ల వయస్సులోనే తన మేధస్సుతో అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి గర్వకారణంగా నిలిచాడు. అతి చిన్న వయసులోనే అసాధారణ గణిత ప్రతిభను ప్రదర్శిస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో జిష్ణు ఆర్యన్ ఈ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
60 సెకన్లలో 216 దశాంశాలు..
కాగా కేవలం 60 సెకన్ల వ్యవధిలో గోల్డెన్ రేషియో (స్వర్ణ నిష్పత్తి)కి సంబంధించిన.. 216 దశాంశాలను చెప్పిన జిష్ణు ఆర్యన్ ఈ అరుదైన ఘనత సాధించాడు. సాధారణంగా పెద్దలకే క్లిష్టంగా అనిపించే ఈ గణిత నిష్పత్తిని ఎనిమిదేళ్ల వయసులోనే గుర్తుంచుకుని చెప్పడం చూసి అక్కడున్న నిపుణులు, ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చిన్నారి అసాధారణ ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పట్ల ప్రశంసలు కురిపించారు. భవిష్యత్తులో కూడా జిష్ణు ఆర్యన్ మరిన్ని జాతీయ, అంతర్జాతీయ రికార్డులు సాధిస్తాడని విద్యావేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా జిష్ణు ఆర్యన్ తండ్రి రవితేజ.. తల్లి శరణి, మాజీ మంత్రి పొంగూరి నారాయణ కుమార్తె. రవితేజ - శరణి దంపతులు ప్రస్తుతం నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లుగా బాధ్యతలు నిర్వహిస్తూ విద్యారంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి బిడ్డ ప్రతిభను గుర్తించి, సరైన మార్గనిర్దేశం చేసి ఈ విజయాన్ని సాధించగలిగేలా చేశారని వారిని కూడా మెచ్చుకుంటున్నారు. జిష్ణు ఆర్యన్ సాధించిన ఈ విజయం దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. చిన్న వయసులోనే ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే, ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించవచ్చని ఈ ఘనత మరోసారి నిరూపించింది.
ఇక మనవడి ఘనతపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గంటా జిష్ణు ఆర్యన్ కేవలం 60 సెకన్లలో 216 దశాంశాల గోల్డెన్ రేషియోను చెప్పి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం ఎంతో గర్వంగా ఉంది. 8 ఏళ్ల వయసులో ఇంతటి ఏకాగ్రత, గ్రహణశక్తి ప్రదర్శించడం సాధారణ విషయం కాదని.. ఆర్యన్‌ను లక్ష్యం దిశగా నడిపించిన తల్లిదండ్రులు రవితేజ, శరణిలకు నా హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications